
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్ ఒక్కసారే శాసనసభ సమావేశాలకు వచ్చారు. అదీ శాసనసభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేయకతప్పదు గాబట్టి వచ్చారు. అంతే వేగంగా తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తమకు ప్రధాన ప్రతిపక్షహోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు వస్తామని లేకుంటే రామని కుంటిసాకు చెప్పి సమావేశాలకు మొహం చాటేశారు.
అయితే శాసనసభలో తాము కేవలం 11 మంది మాత్రమే ఉన్నాము. మన మాట చెల్లదు. కనుక శాసనసభ సమావేశాలకు వెళ్ళి ప్రయోజనం లేదని అంతకు ముందు పార్టీ సమావేశంలో చెప్పారు.
Also Read – మనోభావాలను….మానసిక క్షోభను ‘గాలి’కొదిలేసినట్టేనా.?
కానీ ఇదివరకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో చంద్రబాబు నాయుడుని చాలా దారుణంగా అవమానించినందున, ఇప్పుడు తననీ అదేవిదంగా అవమానిస్తారనే భయంతోనే జగన్ శాసనసభ సమావేశాలకు రావడం లేదని అందరికీ తెలుసు.
అంటే జగన్ శాసనసభ సమావేశాలకు అసలు కారణం ఒకటి.. కొసరు కారణాలు రెండూ ఉన్నాయన్న మాట!
Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?
అయితే ఈసారి శాసనసభ సమావేశాలకు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుంది. రాజ్యాంగంలో సెక్షన్ 101 (4) ప్రకారం ఓ ఎంపీ లేదా ఎమ్మెల్యే స్పీకర్ ముందస్తు అనుమతి తీసుకోకుండా వరుసగా 60 రోజులు సమావేశాలకు హాజరుకాకపోతే ఆ సీటు ఖాళీ అయిన్నట్లు ప్రకటించే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. అదే కనుక జరిగితే జగన్‌తో సహా 11 మందికీ ఉన్న ఆ ఎమ్మెల్యే పదవులు కూడా ఊడిపోతాయి. ఉప ఎన్నికలు వస్తే వాటిలో గెలవలేకపోతే ఇంకా అప్రదిష్ట, అవమానం తప్పదు.
కనుక ఎమ్మెల్యే పదవులు కాపాడుకోవడం కోసమైనా ఈసారి శాసనసభ సమావేశాలకు రాక తప్పదు. కానీ శాసనసభలో ఉంటే అవమానాలు తప్పవు… వాటితో జగన్ ఇగో దెబ్బ తింటే భరించదమూ కష్టమే. కనుక ఈసారి కూడా శాసనసభకు వచ్చి అటెండన్స్ వేయించుకొని పారిపోతారేమో?