కవిత యాత్రలు తెరాస కి రాజకీయ రక్షణ గా మారతాయా.?

Kavitha Bai Bata Yatra

తెలంగాణ ప్రజలకు తనను తానూ అమ్మగా ప్రకటించుకున్న తెరాస అధినేత కవిత నేడు ‘బాయి బాట’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు గాను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో కవిత పర్యటించారు.

అయితే అక్కడ కార్మికులతో కలిసి ఏరియాలోని ఆర్కే – 7 భూగర్భ బొగ్గు గని వద్దకు వెళ్లేందుకు కవిత యత్నించగా అందుకు పోలీస్ అధికారులు నిరాకరించారు. దీనితో అటు కార్మిక సంఘాల నేతలు, ఇటు తెరాస కార్యకర్తలు పోలీసుల నిర్బంధాలను ఛేదించే ప్రయత్నం చేసారు.

ADVERTISEMENT

దీనితో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసుల ఆంక్షలను దాటుకుని, గేట్లను తోసుకుని కవిత, తెరాస శ్రేణులు గని లోపలి చొక్కుకుని పోయారు. కార్మికుల ను కలవనీయకుండా పోలీసులు తనను అడ్డుకునే ప్రయత్నం చేసారని వారి పై మండిపడ్డారు కవిత.

కార్మికులతో కలిసి గేట్ మీటింగ్ పెట్టుకునే హక్కు తనకుందని, సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకుందామని వస్తే అధికారులతో తనను అడ్డుకోవడం సమంజసం కాదని, ఇది ప్రభుత్వ పిరికిపంద చర్య అని, గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చినప్పుడు ఇక్కడ లేని ఆంక్షలు ఇప్పుడు తనకెందుకంటూ ధ్వజమెత్తారు కవిత.

కార్మికుల హక్కులను కాలరాస్తే తెరాస చూస్తూ ఊరుకోదని, కార్మికుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధమంటూ ప్రకటించారు కవిత. సింగరేణి కార్మికుల కనీస అవసరాలను కూడా సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం మానవహక్కులు ఉల్లంగిస్తున్నారని, గనుల్లో కార్మికులకు సరైన భద్రతా కొరవడిందంటూ వాపోయారు.

అయితే కవిత చేస్తున్న ఈ యాత్రలు తెలంగాణ లో ‘తెలంగాణ రక్షణ సేన’ కు రాజకీయ రక్షణ గా మారతాయా.? తెలంగాణలో కనిమరుగైన తెరాస కి తిరిగి జీవం పొయ్యగలవా.? గతంలో అనేకమంది తెలంగాణ కేంద్రంగా రాజకీయ పార్టీలు స్థాపించారు, ఇలానే కవిత మాదిరి తెలంగాణ ప్రభుత్వం మీద, ప్రత్యేక తెలంగాణ అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా దూకుడుగా ముందుకెళ్లారు.

కానీ ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల కాలగర్భంలో కలిసి పోవడమో, ఇతర పార్టీలలో విలీనం తో తనువు చాలించడంతోనో సరిపెట్టుకున్నాను. మరి కవిత తెరాస వాటన్నిటికీ భిన్నంగా విలీనం తో కనుమరుగుకాకుండా ముందుకెళ్లగలదా.? కవిత తీసుకెళ్లగలరా.?

ADVERTISEMENT
Latest Stories