
గతేడాది జరిగిన 17 వ ఐపీఎల్ సీజన్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ సంఘటన అంటే లక్నో సూపర్ జాయింట్స్ జట్టు కెప్టెన్ రాహుల్- ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా మధ్య జరిగిన సంభాషణ అని చెప్పవచ్చు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో నిర్దేశించిన 166 పరుగుల ఛేదన ను హైదరాబాద్ జట్టు కేవలం 9 .4 ఓవర్లలో విజయవంతంగా పూర్తి చేసి భారీ విజయాన్ని అందుకున్నారు.
ఆ ఘోర ఓటమి తరువాత ఒక జట్టు ప్రాంచైజీ గా ఉన్న సంజీవ్ గోయెంకా, కెప్టెన్ కెఎల్ రాహుల్ కు తోడుగా నిలబడాల్సిన సమయంలో, జట్టు ఓటమి పై ఓపెన్ గా గ్రౌండ్ లో అందరి ముందు తన అసహనాన్ని వ్యక్త పరిచాడు, రాహుల్ ను అవమానించాడు. ఆట అన్నాక గెలుపు, ఓటములు సహజం అనే విషయాన్నీ కూడా మరిచి కె.ఎల్.రాహుల్ వంటి దిగ్గజ ఆటగాడ్ని అలా అవమానించటం రాహుల్ అభిమానులకు ఎంతో కోపం వచ్చేలా చేసింది.
Also Read – తెలుగు వాడి ఆత్మ గౌరవం…తెలంగాణ నినాదం…!
అయితే, అప్పటి నుండి రాహుల్ లక్నో జట్టు నుండి బైటకు వచ్చేస్తున్నాడు అనే పుకార్లు రాగా, ఎట్టకేలకు ఆ జట్టును వీడి ఢిల్లీ జట్టులో ఎంపికయ్యాడు రాహుల్. ఆ జట్టు కెప్టెన్సీ ను ఆఫర్ చేసినా, దానిని సున్నితంగా తిరస్కరించాడు రాహుల్. ఈ ఒక్క విషయం చెప్తుంది, రాహుల్ తనపై వచ్చిన విమర్శలన్నిటికి తన బ్యాట్ తోనే బదులు చెప్పాలనుకుంటున్నాడు అనేది.
ఇదొక్కటే కాక, సంజీవ్ గోయెంకా లక్నో జట్టు కన్నా ముందే 2016 -17 ఐపీఎల్ లో రైసింగ్ పూణే సూపర్-జయింట్స్ జట్టు కు కూడా ఓనర్ గా ఉన్నాడు. అప్పుడు కూడా, 2016 లో ఎం.ఎస్.ధోని సారధిగా ఉండగా, ఆ సీజన్ కనీసం ప్లే-ఆప్స్ కు కూడా అర్హత సాధించలేదు. ఇక 2017 సీజన్ ప్రారంభానికి ముందే ధోని ను కాదని స్టీవెన్ స్మిత్ కు కెప్టెన్సీ పగ్గాలను అందించారు పూణే యాజమాన్యం.
Also Read – ఉల్ఫా బ్యాచ్ అట… జగన్ హర్ట్ అవరూ?
ఆ సంఘటనతో కూడా గోయెంకా వార్తలలో నిలిచారు. ఇలా, ఆటగాళ్ల నుండి చిన్న చిన్న పొరపాట్లకు కూడా అసహనానికి గురవటం భావ్యం కాదని ఎందరో క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి, ఇవాళ్టి మ్యాచ్ లో రాహుల్ బరిలోకి దిగి లక్నో జట్టు పై ఒక అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాలంటూ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.