నాడు తెలంగాణ వ్యతిరేకి అన్నారు కానీ నేడు….

Will Telangana Back Revanth Reddy Over Regional Politics Again?

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలు ఎన్నడూ ఏ ఆంధ్రా నాయకుడ్ని ద్వేషించలేదు, ఏ ఆంధ్రా పౌరుడి మీద నిందలు వేయలేదు, అలాగే ఏపీలో ఏ ప్రాంతం మీద కూడా విషం చిమ్మలేదు.

కానీ వారి ప్రాణ త్యాగాలను పెట్టుబడిగా పెట్టి తమ రాజకీయ భవిష్యత్ కి పునాదులు వేసుకున్న అనేకమంది నాయకులు ఇప్పటికి తెలంగాణ పేరు చెప్పుకుంటూ ఆంధ్రోళ్ళు అంటూ ఏపీ నాయకుల నుంచి ఇక్కడి ప్రాంతాల వరకు విమర్శలు చేస్తూనే ఉన్నారు, వేలెత్తి చూపుతూనే వస్తున్నారు.

ADVERTISEMENT

రాజకీయ నాయకులు ఆడే రాజకీయ చదరంగంలో ఎప్పుడు బలిపీఠం ఎక్కేది సామాన్యులు మాత్రమే అనేది తెలంగాణ అమరవీరుల కుటుంబాలను చూస్తే యిట్టె అర్ధమవుతుంది. రాజకీయ నేతలు సృష్టించే భావోద్వేగ రాజకీయ చట్రంలో చిక్కుకుని చివరికి ప్రాణాలు తీసుకునేది సామాన్య ప్రజలే. ప్రయోజనాలు మాత్రం రాజకీయ నాయకులకే.

అయితే వారి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ లో వారి కుటుంబాలు అభివృద్ధి చెందాయా.? అంటే సమాధానం దొరక్కపోవచ్చు కానీ వారి ఆత్మాహుతులు అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగిన నాయకుల కుటుంబాలు మాత్రం రాజకీయంగానే కాదు సామాజికంగా ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాయి.

అలాగే వారి ఎదుగుదలకు మరొకరు అడ్డంకి కాకుడదు అనే భావంలో ఉన్న ఆ సోకాల్డ్ రాజకీయ నేతలందరూ తెలంగాణలో మరోపార్టీ రాజకీయం చెయ్యకూడదని, మరో నేత రాజకీయంగా ఎదగకూడదని ఆంక్షలు పెడుతున్నారు, షరతులు విధిస్తున్నారు.

అయితే ప్రజలు ఆ ఆంక్షలను, షరతులను దాటి ఎప్పుడో ముందుకెళ్ళిపోయారని ఇప్పటికి ఆ సోకాల్డ్ నేతలు గ్రహించలేకపోతున్నారు. గతంలో రేవంత్ రెడ్డిని సైతం తెలంగాణ వ్యతిరేకి అంటూ ప్రచారం చేసారు, ఇప్పటికి రేవంత్ ని బాబు మనిషి అంటూ చిత్రీకరిస్తుంటారు.

కానీ తెలంగాణ ద్రోహి అంటూ ప్రచారం చేసిన అదే రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు, ఆయన పై జరిగిన మూకుమ్మడి రాజకీయానికి చెక్ పెట్టేలా తెలంగాణ సమాజం మొత్తం రేవంత్ వెనుక నిలబడింది. రేవంత్ పోరాటల ఫలితమే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో పదేళ్ల తరువాత అధికారాన్ని అందిపుచ్చుకుంది.

ఇక ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ప్రాంతీయవాద రాజకీయాలలో కూడా సీఎంగా రేవంత్ ఎక్కడ కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఆయన కష్టంతో తెచ్చిన ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తున్న కొంతమంది నేతలు తమ గుర్తింపు కోసమో, ఇతర నేతల సంతృప్తి కోసమో మీడియాలో రెచ్చిపోతున్నారు.

అలాగే గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో రేవంత్ పై బిఆర్ఎస్ నేతలు తెలంగాణ ద్రోహి అని తెలంగాణ వ్యతిరేకి అంటూ ఎన్నో నిందలు మోపారు, ఓటుకు నోటు అంటూ మరెన్నో విమర్శలు చేసారు. చివరికి రేవంత్ ని జైలుకు పంపి తన కుమార్తె వివాహానికి కూడా బైలు మీద హాజరయ్యేలా చేసారు. అలాగే 2018 ఎన్నికలలో కూడా రేవంత్ ఓటమికి పరోక్షంగా బిఆర్ఎస్ కారణంగా నిలిచింది.

ఇక కాంగ్రెస్ లో సైతం రేవంత్ ఒంటరి పోరాటం చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో జరిగే అంతర్గత రాజకీయాలను తట్టుకుని అధిష్టానం ఆశీస్సులు సంపాధించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ చేస్తున్న ప్రాంతీయవాద రాజకీయానికి, కాంగ్రెస్ లో కొంతమంది నేతలు చేస్తున్న రెచ్చకొట్టే వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతారా.?

ADVERTISEMENT
Latest Stories