భారత సైనిక నారీ శక్తి…

women-power-in-indian-armed-forces

నేడు పాకిస్తాన్ ఉగ్రవాదం పై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం ప్రదర్శించిన తెగువను, చాకచక్యాన్ని దేశ ప్రజలందరూ అభినందిస్తున్నారు. అలాగే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ కూడా భారత ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు.

అయితే ఈ ఆపేరేషన్ సింధూర్ తో గత నెలలో పెహల్గామ్ లో ఈ ఉగ్ర మూకల పైశాచికత్వానికి బలైన కుటుంబాలు కూడా భారత్ సైన్యానికి జిందాబాద్ లు కొడుతూ, తమ వారి మరణాలకు న్యాయం జరిగిందంటూ, వారి ఆత్మ ఇప్పుడు శాంతించిందంటూ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెపుతున్నారు.

ADVERTISEMENT

అలాగే ఇటు ఇది ఉగ్రవాదం పై భారత్ చేసిన దాడిగా అభివర్ణిస్తున్న భారత ఆర్మీ నేడు ఆపరేషన్ సింధూర్ పై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. అయితే ఈ కార్యక్రమంలో మీడియా ముందుకొచ్చిన దేశ విదేశాంగ శాఖ అధికారి విక్రమ్ మిస్రీ తో పాటుగా మరో ఇద్దరు ఆర్మీ మహిళాధికారులు కూడా పాల్గొనున్నారు.

ఇందులో ఒకరు భారత సైనిక దళానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్ సోఫియా ఖురేష్, మరొకరు వాయుసేన అధికారి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. గుజరాతీ సైనిక కుటుంబానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేష్ భారత్ సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిణిగా పేరు సంపాదించారు.

ఇక వాయుసేన అధికారిణిగా చెప్పబడుతున్న వ్యోమికా సింగ్ 2019, డిసెంబర్ 18 భారత వైమానిక దళంలో హెలికాఫ్టర్ పైలెట్ గా నియమితులయ్యారు. ఆమె గతంలో కూడా అనేక రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఆపేరేషన్ సింధూర్ లో కూడా భారత ఆర్మీ తరఫున ఉగ్రముష్కరుల అంతంలో తన వంతు పోరాటం చేసి ఇప్పుడు దేశ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.

దీనితో భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంతటి ప్రతీకార చర్యలకు భారత్ ఆర్మీ సేన ఇటువంటి నారీ శక్తి తో దాడికి వెళ్లిందంటే భారత సైనిక దళంలో మహిళల శక్తి ఎటువంటి కీలక పాత్ర పోషిస్తుందో అర్ధమవుతుంది. ఈ మహిళా అధికారుల విజయ గర్వం చూసిన నేటి భారత సమాజం వీరిని ఆదిశక్తులుగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories