నాకు నచ్చిందే చూపిస్తా..! అంతా నా ఇష్టం.

Yatra-2

తాజాగా విడుదలైన యాత్ర 2 ,2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా. అయితే ఇదంతా కూడా ప్రజలకు తెలిసిన కథే కావడంతో ఏమాత్రం మార్పులు చేర్పులు చేసినా ఇట్టే గ్రహించగలుగుతారు. ఇదంతా తెలిసి కూడా దర్శకుడు ఒక వర్గం వారికీ మేలు చేయడానికి జరిగిన వాస్తవ సంఘటనలను దాచేస్తూ కొన్ని కల్పితాలు సృష్టిస్తూ తాము చెప్పిందే వాస్తవం అనేలా సినిమాను తెరకెక్కించారు.

2009 తరువాత జగన్ చేసిన ఓదార్పు యాత్ర, 2019 లో చేసిన పాదయాత్రను చూపించిన దర్శకుడు ఆ మధ్యలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో షర్మిల చేసిన యాత్రను చూపించే సాహసం చేయలేకపోయారు. అలాగే గెలవడం కోసం సాధ్యం కానీ హామీలు ఇచ్చి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేను అంటూ ఇచ్చిన ఎలివేషన్ సీన్ చూస్తుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని మీద జగన్ చేసిన ప్రకటన, రాష్ట్రంలో సంపూర్ణ మధ్యపాన నిషేధం అంటూ ఇచ్చిన మాట…అందరి చెవులను సృశిస్తున్నాయి.

ADVERTISEMENT

ఎన్నికల ముందు ఇలా సినిమాలతో పక్క పార్టీల నేతలను కించపరుస్తూ తనకు ఎలివేషన్ సినిమాలు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. తనకు నచ్చిన వ్యక్తి గెలుపు కోసం జరిగిన సంఘటనలను కూడా తమకు అనుకూలంగా మార్చేరుసుకుని హీరోలుగా చూపించడం, తమకు గిట్టని వారిని విలన్లు గా మార్చేయడం ద్వారా ప్రజలను ప్రభావితం చేసేయవచ్చని ఈ మూవీ దర్శకుడు భావించినట్టు ఉన్నారు.

నాలుగు సెంటి మెంట్ డైలాగ్స్ పెట్టుకుని, కొన్నిఎలివేషన్ సీన్లు రాసుకుని జరిగింది మొత్తం తమకు అనుకూలంగా మార్చేసుకోవాలనే ఆరాటం తప్ప మరొకటి కనబడలేదు. జగన్ జీవితంలో అత్యంత కీలక సంఘటనలైనా 2019 ఎన్నికల ముందు వివేకా హత్య కేసు కానీ, జగన్ కోడి కత్తి కానీ దర్శకుడుకి కనపడకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించాయి. 2009 నుంచి 2019 వరకు జగన్ జీవితాన్ని తెరకెక్కించాం అంటూ చెప్పిన దర్శకుడు ఇటువంటి ముఖ్యమైన సంఘటనలను విస్మరించడం అంటే వీటి గురించి ప్రజలు ఎప్పటికి చర్చించుకోకూడదని వీరి ఉద్దేశమా..?

అయితే సినిమా లో వైస్సార్ పాత్ర చేసిన మమ్ముటి ఇప్పటికే ప్రేక్షకుల మన్ననలు పొందారు. అలాగే జగన్ పాత్రలో నటించిన జీవా కూడా పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి. ఇక విలన్లుగా చూపించిన సోనియా, చంద్రబాబు పాత్రల కోసం పెద్దగా శ్రద్ద పెట్టలేదని చెప్పాలి. అసలు చెల్లి షర్మిల పాత్రను ఎడిటింగ్ లో లేపేశారో..? లేక అసలు సినిమా మొదలుపెట్టినప్పుడే వద్దనుకున్నారో కానీ షర్మిల ఎక్కడ కనపడలేదు, వినపడలేదు. అయితే సినిమా చూసి ప్రజలు ఇవ్వాల్సిన రివ్యూ లను కూడా ప్రభుత్వ సలహాదారులు , మంత్రులే ఇచ్చేస్తున్నారు.

తమకు నచ్చని వారిపై తమకు నచ్చిందే ప్రచారం చేసి మీడియా ప్రజల మీద రుద్దుతుంది అంటూ కామెంట్ చేసిన దర్శకుడు ఇప్పుడు జరిగిన కథ అంటూ చెప్పి తనకు నచ్చిన అంశాలనే తెరకెక్కించి అదే వాస్తవం అంటూ ప్రజలమీద రుద్దాలని చూడడం ఏమాత్రం సమంజసమో సమాధానము చెప్పగలరా..?

ADVERTISEMENT
Latest Stories