
ఒకే అంశంపై ఒక్కో వ్యక్తి స్పందన ఒక్కోలా ఉంటుంది. నిండుగా ప్రవహిస్తున్న కృష్ణనదిని చూసి సిఎం చంద్రబాబు నాయుడు కడుపు నిండిపోయిందన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలో రాయలసీమతో సహా ఎక్కడా నీటికి కరువు ఉండదని అన్నారు.
అయితే వైసీపి ఇందుకు పూర్తి భిన్నంగా స్పందించింది. “జగన్ హయాంలో రూ.369.89 కోట్లతో నిర్మించిన రిటైనింగ్ వాల్‌తో.. కృష్ణానది పరుగులు పెడుతున్నా గుండెలపై చేయి వేసుకుని నిశ్చింతగా ఉన్న బెజవాడ వాసులు,” అంటూ జగన్ ఫోటోతో రీటేయినింగ్ వాల్‌ని ఒరుసుకుంటూ పారుతున్న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంటే విజయవాడవాసులను జగన్ కాపాడేశారన్న మాట! ఇంకా దీనిపై టిడిపి స్పందించలేదు. స్పందిస్తే దీని వెనుక జరిగిన అవినీతి భాగోతాన్ని తప్పక బయట పెడుతుంది. అది వేరే విషయం.
కానీ 5 ఏళ్ళపాటు విధ్వంస పాలన చేసిన జగన్, రాష్ట్రానికి కలిగించిన నష్టాన్ని లెక్క వేయడం కాగ్ వల్ల కూడా కాదేమో?
ఒక్క అమరావతిలోనే జగన్ నిర్వాకంతో రాష్ట్రానికి సుమారు రూ.2-3 లక్షల కోట్లు నష్టం జరిగి ఉంటుందని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజధానిని పాడుబెట్టి కృష్ణానదికి రీటెయినింగ్ వాల్ కట్టామని వైసీపి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా?
Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?
మరోవిషయం ఏమిటంటే విజయవాడలోని ప్రజలందరినీ కాపాడేందుకు కృష్ణానది రీటేయినింగ్ వాల్ కోసం జగన్ ప్రభుత్వం రూ. 369.89 కోట్లు ఖర్చు చేయగా, విశాఖలో ఋషికొండపై తాను, తన కుటుంబం నివసించేందుకు జగన్ నిర్మించుకున్న ప్యాలస్‌లకు రూ.400-500 కోట్లు ఖర్చు చేశారు. జగన్ భద్రత కోసం చేసిన ఖర్చుల లెక్కలు తీస్తే అదో పెద్ద గ్రంధమే అవుతుంది. అంటే ప్రజల కోసం చేసిన ఖర్చు కంటేజగన్ తన కోసం ఖర్చుపెట్టుకున్నదే ఎక్కువన్న మాట!