
హైద్రాబాద్ లో ఉంటూ, సినిమాలలో నటిస్తూ అపుడప్పుడు రాజకీయ వేదికల మీద కనిపిస్తూ వైసీపీ మీద విమర్శలు చేస్తూ, జగన్ పై విరుచుకుపడే పవన్ కళ్యాణ్ ‘పార్ట్ టైం పొలిటీషియన్’ అంటూ గత ఐదేళ్లు వైసీపీ నేతలు చేసిన విమర్శలు, పవన్ ను కించపరిచిన విధానాలు ఇప్పటికి జనసేన శ్రేణుల చెవులలో మారుమోగుతూనే ఉంటాయి.
అయితే అదంతా కూడా గతం. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షం కోసం పోరాడుతుంది. అయితే గత ఐదేళ్లు ఏపీ దాటి ఎవరు అడుగు బయట పెట్టినా వారిని పార్ట్ టైం పొలిటీషియన్ అని, వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేసిన వైసీపీ ఇప్పుడు ఏపీ రాజకీయాలకు మరో కొత్త ట్రెండ్ ను పరిచయం చేసింది.
Also Read – మీరు ఎమ్మెల్యేలయ్యా… దొంగలుకారు!
ఫుల్ టైం పొలిటీషియన్స్, పార్ట్ టైం పొలిటీషియన్స్ అనే రెండు రకాల రాజకీయ నాయకులను చూసిన ఏపీ రాజకీయాలు ఇప్పుడు ‘చీఫ్ గెస్ట్ పొలిటిషన్’ రాజకీయాలను చూస్తున్నాయి. ఈ చీఫ్ గెస్ట్ అనే పదం సినిమా వేదికల మీద, లేదా ఏదైనా కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఎక్కువగా వింటుంటాం.
అయితే కార్యక్రమం మొత్తానికి ముఖ్య అతిధిగా విచ్చేసే ఈ చీఫ్ గెస్ట్, అయితే కార్యక్రమానికి ముందుగా వచ్చి ప్రారంభోత్సవం పూర్తి కాగానే వెళ్ళిపోతారు, లేదా కార్యక్రమం చివరిలో వచ్చి నాలుగు ముక్కలు మాట్లాడి పాక్ అప్ చెపుతారు. సరిగ్గా గమనిస్తే ఇప్పుడు ఏపీలో జగన్ చేస్తున్న రాజకీయాలు కూడా అచ్చం ఇదే తీరుగా కనిపిస్తున్నాయి. బెంగళూర్ లో బస చేస్తూ ఏపీకి చీఫ్ గెస్ట్ గా విచ్చేస్తూ జగన్ చేస్తున్నవి వీకెండ్ రాజకీయాలా.? లేక వీక్ లెస్ రాజకీయాలా.?
Also Read – నాడు అమరావతి విలవిలా.. నేడు కళకళా!
మొన్న అసెంబ్లీ లో వైసీపీ చేసిన రాజకీయం, జగన్ నడుచుకున్న తీరు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎదో చీఫ్ గెస్టు వచ్చినట్టు అసెంబ్లీకి అలా వచ్చారు..ఇలా వెళ్లిపోయారు. అలాగే వైసీపీ ఓటమి తరువాత బెంగళూర్ టూ తాడేపల్లి ప్యాలస్ ల చుట్టూ డైలీ సర్వీస్ చేస్తున్న జగన్ తమ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా విచ్చేసి పార్టీ క్యాడర్ కు తానూ చెప్పాలనుకున్న రెండు ముక్కలు చెప్పేసి మళ్ళీ తిరిగి బెంగళూర్ ఫ్లయిట్ ఎక్కుతున్నారు.
మొన్న నందిగామ సురేష్ పరామర్శ యాత్ర కానీ, నేడు వల్లభనేని వంశీ ఓదార్పు యాత్ర కానీ,అంతకు ముందు జరిగిన పిన్నెలి జైలు యాత్ర కానీ, విజయవాడ వరదలు కానీ, తిరుమల లడ్డు ప్రసాదం వివాదం లో కానీ జగన్ ఇలా గన్నవరంలో ఫ్లయిట్ దిగుతున్నారు, అలా వారిని పరామర్శిస్తున్నారు, కూటమి ప్రభుత్వం పై నాలుగు విమర్శలు చేస్తున్నారు, ఇక ఆ పై తిరిగి బెంగళూర్ ఫ్లయిట్ ఎక్కుతున్నారు.
Also Read – పాదయాత్ర: చరిత్ర కాదు…భవిష్యత్తే..!
మరి వైసీపీ అథినేతగా, ఏపీలో ప్రతిపక్ష నేత హోదా కోసం ఆరాటపడుతున్న రాజకీయ నాయకుడిగా వైసీపీ చేసే ఇలాంటి రాజకీయానికి ‘చీఫ్ గెస్ట్ రాజకీయాలు’ అని ఇటువంటి రాజకీయాలను ఏపీకి పరిచయం చేసిన జగన్ ను ‘చీఫ్ గెస్ట్ పొలిటీషియన్’ అని నామకరణం చెయ్యాల్సిందే. అయితే ఈ చీఫ్ గెస్ట్ రాజకీయాలతో వైసీపీ ప్రజలలో ఇంకాస్త చీప్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.