Jagan

జగన్‌ దాదాపు ఒకటిన్నర దశాబ్ధాలుగా రాజకీయాలలో ఉన్నారు. ఐదేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేశారు.

చేతిలో పదవీ, అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యం చేస్తే అది వాటి వలన వచ్చిన అహంకారమని అర్దం చేసుకోవచ్చు.

Also Read – అయ్యో పాపం.. టీడీపీ కార్యకర్తలు!

కానీ అధికారం కోల్పోయినా జగన్‌ నోరు, తీరు రెండూ మారలేదు. జగన్‌ వల్లనే వైసీపీ గెలిచిందని గొప్పగా చెప్పుకుంటారు కనుక ఆయన వల్లనే ఓడిపోయిందని ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తోంది. దాని వలన వైసీపీకి తప్ప ఎవరికీ నష్టం లేదు కనుక పట్టించుకోనవసరం లేదు.

కానీ ఇన్నేళ్ళు రాజకీయాలలో నలిగిన తర్వాత ఇంకా ఆ పిచ్చి మాటలేమిటి?ఆ డ్రామాలు దేనికి?అని వైసీపీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read – వైసీపీ కి జనసేన… బిఆర్ఎస్ కు బీజేపీ..?

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విజయవాడ, గుంటూరులో జగన్‌ ఊరేగింపులను అనుమతించలేదు. కానీ పట్టించుకోకుండా జగన్‌ వెళ్ళారు.

అలవాటుగా పొరపాటు అన్నట్లు తనకు భద్రత కల్పించలేదంటూ జగన్‌ విమర్శలు చేసి సిఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలకి అడ్డంగా దొరికిపోయారు.

Also Read – రేవంత్ రెడ్డి…మరో జగన్ రెడ్డి కానున్నారా.?

“కోడ్ అమలులో ఉన్నప్పుడు అనుమతి లేకుండా జగన్‌ ఊరేగడం తప్పు కాదా?ఆయన చట్టాన్ని, వ్యవస్థలని ధిక్కరించి ఊరేగితే ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించాలా?అవసరం ఏమిటి?” అంటూ చంద్రబాబు నాయుడు ఘాటుగా జవాబు ఇచ్చారు.

వైసీపీ నేతలపై కేసుల గురించి మాట్లాడాలనుకునప్పుడు అవి ఏవిదంగా తప్పో ప్రజలకు వివరించాలి. కానీ వైసీపీ నేతలందరు అందగాళ్ళు కనుకనే చంద్రబాబు నాయుడు వారిపై అసూయతో అరెస్టులు చేయిస్తున్నారని జగన్‌ చెప్పడం చూసి వైసీపీ నేతలందరూ తలలు పట్టుకున్నారు.

దారిలో ఓ పాపతో డ్రామా చేసి జగన్‌ అందరి దృష్టి ఆకర్షించాలనుకున్నారు. కానీ ఆ పాప చేత ‘అమ్మ ఒడి’ పధకం గురించి మాట్లాడించడంతో అదీ బెడిసికొట్టింది.

ఆ పాప తల్లి తండ్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారని, వారికి వ్యాపారాలున్నాయనే విషయం టీడీపీ మద్దతుదారులు సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో పాలుపోక, జగన్‌ సెల్ఫీ దిగితే టీడీపీ మద్దతుదారులు అభంశుభం తెలీని ఆ పాపని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారంటూ నష్ట నివారణకు ప్రయత్నిస్తున్నారు.

జగన్‌ శాసనసభ సమావేశాలకు వెళ్ళకపోవడం, కోర్టు కేసులు, ఆయన కోసం అత్యుత్సాహం ప్రదర్శించిన వంశీ, కొడాలి నాని వంటి వైసీపీ నేతల మెడలకు కేసులు చుట్టుకుంటున్నాయి.




ఇవన్నీ సరిపోవన్నట్లు ఇప్పుడీ డ్రామాలు, పిచ్చి ప్రేలాపనలు చూసి, జగన్‌ ప్రజల మద్యకు వచ్చి ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతుంటే తలెత్తుకోలేకపోతున్నామని, ఆయన తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని పార్టీ సమావేశాలతో కాలక్షేపం చేస్తేనే మంచిదని వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారు. అంతేగా.. నిజమేగా?