ఇంతకాలం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆయనకు తానాతందానా పాడేవారు. కానీ ఇప్పుడు ఒకరొకరుగా జగన్ తప్పులను వేలెత్తి చూపుతున్నారు.
తాజా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తన అనుచరులతో మాట్లాడుతూ, “పార్టీలో ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు విలువ ఇవ్వకుండా ‘ఐప్యాక్’ అనే ఓ పనికిమాలిన సంస్థని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడం వలననే ఎన్నికలలో ఓడిపోయామని భావిస్తున్నాను. పార్టీలో ఉండేవారికి దక్కాల్సిన సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు.
అసలు ఈ ‘ఐప్యాక్’కి రాజకీయాలతో సంబంధం ఏమిటి? కాన్పూర్, ఖరగ్‌పూర్, బెంగళూరు లేదా మరోచోటి నుంచి ఐఏఎం, ఐఐటీ, ఐబీఎం డిగ్రీలున్న వారిని పట్టుకువచ్చి మా నెత్తిన పెడితే, వారు తమ పబ్బం గడుపుకోడానికి ప్రజా ప్రతినిధులను వ్యతిరేకించేవారిని ఇంటర్వ్యూలు చేసి, జగన్‌కు చెడుగా నూరి పోసేవారు.
రాజకీయాలకు పనికిరాని డిగ్రీలతో వచ్చినవారు నిత్యం రాజకీయాలలో ఉండే మా అందరినీ ముంచేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోయారు,” అని కొట్టు సత్యనారాయణ అన్నారు.
విశాఖని రాజధాని చేస్తామని చెప్పి చేయకపోవడం వలననే ఓడిపోయామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.
మరొకరు వాలంటీర్ల వలన ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా పోయాయని చెప్పుకున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ రెడ్డి సీఎంవో కార్యాలయంలో ఉండే కొందరు ఉన్నతాధికారులు జగన్‌కు, మంత్రులు, ఎమ్మెల్యేలకు మద్య దూరం పెంచడం వలన ప్రజాసమస్యలు పరిష్కరించలేక చెడ్డపేరు మూటగట్టుకొని ఓడిపోయామని చెప్పుకున్నారు.
ఇలా ఒక్కొక్కరూ ఇప్పుడు ఒక్కో కారణం చెపుతుండటం గమనిస్తే తమ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకునవన్నీ తప్పుడు నిర్ణయాలే అని, ఆయన తప్పుడు నిర్ణయాలకు తామందరం బలి అయిపోయామని చెప్పుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ 5 ఏళ్ళ పాలనలో జగన్ చేసిన మంచి పనులను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు కానీ చేసిన తప్పులను, లోపాలను లెక్కపెట్టడం ఎవరి తరం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని అడిగినా జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, అనాలోచిత నిర్ణయాలు, అవినీతి, అక్రమాలు, అరాచకాలా గురించి ఏదో ఒకటి చెప్పగలరు.
అన్ని తప్పులు చేసిన జగన్ ఇంకా తమను ఎవరో మోసం చేశారని చెప్పుకోవడం తనను తాను మోసం చేసుకోవడమే అవుతుంది. పార్టీ నేతలు, కార్యకర్తలని ఇంకా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లే భావించవచ్చు.
I-PAC అనేది పనికిమాలిన సంస్థ… అందులో సన్నాసులను…
– మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ#EndOfYSRCongress pic.twitter.com/tGM0rWTup8
— M9 NEWS (@M9News_) June 8, 2024




