Jagan YCP Leaders

జగన్ కోసం మా ప్రాణాలైనా ఇస్తాం అంటూ వైసీపీ లో కొందరు కరుగట్టిన ఉగ్రవాదుల మాదిరి ప్రవర్తించే నాయకులకు సైతం జగన్ ప్యాలస్ లో ఏమాత్రం గౌరవం దక్కుతుందో ఈ నాటి తాడేపల్లి ప్యాలస్ లో పార్టీ నేతలలో జగన్ జరిపిన సమావేశంలో రుజువయ్యింది.

సుమారు రెండు ఎకరాల స్థలం లో నిర్మించిన ప్యాలస్ లో జగన్ ను కలవడానికి వచ్చిన వైసీపీ నాయకులు కూర్చుకుని సమావేశం జరుపుకునే స్థానం లేదా అన్న విధంగా తనను కలవడానికి వచ్చిన వైసీపీ నాయకులందరినీ తన ముందు చేతులు కట్టుకుని నిల్చోబెట్టుకున్నారు జగన్.

Also Read – అమరావతిలో బసవతారకం….

జగన్ నుంచి ఈ పాటి గౌరవం కోసమేనా తమ సొంత ఇమేజ్ ను పాతాళానికి తొక్కుకుంటూ, సామజిక వర్గాల పరువును సైతం తాకట్టు పెట్టుకుని జగన్ కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్దమయ్యింది అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కేవలం జగన్ కళ్ళలో ఆనందం చూడడం కోసం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు కర్రలతో దాడికి వెళ్ళాడు జోగి రమేష్.

అందుకు ప్రతిగా జోగికి మంత్రి పదవి ఇచ్చి సత్కరించారు జగన్. జగన్ మెప్పుకోసం కులాన్ని కూడా కించపర్చడానికి ఏమాత్రం ఆలోచించని పేర్ని నాని, తనను గెలిపించింది బాబు ను బూతులు తిట్టడానికే అన్నటుగా కొడాలి నాని, మంత్రి పదవుల కోసమే ప్రతిపక్షాలను ఇంతలా వేధించాలా.? జగన్ కు ఇంతలా భజన చేయాలా.? అనేలా విడుదల రజనీ, వెల్లంపల్లి వంటి వారు కూడా తమ స్థాయికి మించి బాబు ను, పవన్ ను విమర్శించారు.

Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…

తమ రాజకీయ భవిష్యత్తును తాకట్టుపెట్టుకుని మరి అటు ప్రజలలో చులకనై ఇటు రాజకీయాలలో విలువ పోకొట్టుకోవడానికి సైతం సిద్ధపడ్డ నేతలను సైతం జగన్ తన ముందు కూర్చోబెట్టుకొవడానికి కూడా అంగీకరించలేదా..? జగన్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి ఒక్కో వైసీపీ నాయకుడు ప్రజలకు వివరిస్తున్నారు.

అందులో రాజా నగరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన జక్కం పూడి రాజా జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యే గా గెలిచిన నాయకులకు సైతం గత ఐదేళ్లుగా జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, ఎన్నికలకు రెండు నెలల ముందు ఒక్క సంతకం కోసం కాగితాలు పట్టుకుని గేటు బయట ఎదురు చూసిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

Also Read – అందరికీ ఓ రెడ్‌బుక్ కావాలి.. తప్పు కాదా?

ఇలా వైసీపీ ఓటమికి అన్ని రకాలుగా బాధ్యతలు స్వీకరించాల్సిన జగన్ తన పార్టీ ఎమ్మెల్యే ల వలనే తనకు ముఖ్యమంత్రి వి పోయింది అనే అక్కసుతో వారికీ పనిష్మెంట్ ఇచ్చారా అన్న విధంగా తానూ మాత్రం కూర్చొని తన పార్టీ ఎమ్మెల్యే కు కనీసం కుర్చీ కూడా వేయకుండా తన ముందు నిల్చోపెట్టుకుని మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనితో మరోసారి తాడేపల్లి ప్యాలస్ లో విడుదలైన చిరు వీడియో చర్చకు వచ్చింది. అప్పుడు చిరు పట్ల జగన్ అనుసరించిన తీరును సమర్ధించిన వైసీపీ నేతలకు ఇటువంటి గౌరవం సమర్ధనీయమే అంటూ మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జగన్ తన అహాన్ని చల్లబరుచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలను ఎంచుకుంటారేమో.? అదే వైసీపీ సిద్ధతామేమో.? పరిస్థితులు చూస్తుంటే వైసీపీ లోగుట్టు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే సమయం ఆసన్నమయ్యినట్టే కనపడుతుంది సుమీ..!