AP BJP

దక్షినాది రాష్ట్రాలలో అసలు ఏమాత్రం బలం లేని బీజేపీ ఇప్పుడిప్పుడే ప్రాంతీయ పార్టీల అండతో ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకెళ్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి నోటా కన్నా తక్కువ ఓట్లు సాధించుకునే స్థాయి. అటువంటి స్థాయి నుంచి ఇప్పుడు పోటీ చేసిన 10 స్థానాలలో 8 స్థానాలను దక్కించుకోగలిగారు.

ఇదంతా కూడా బీజేపీ కి టీడీపీ, జనసేన కూటమి వలన వచ్చిన బలమే అనేది తెలిసినప్పటికీ బీజేపీ వైసీపీ నేతలకు ఆశ్రయం కల్పించడానికి సిద్దమవుతుంది అంటూ వార్తలు రావడంతో టీడీపీ, జనసేన మద్దతుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Also Read – చంద్రబాబు పాలనకు జీరో మార్కులట మరి…

గడిచిన ఐదేళ్లుగా టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్త నుంచి ఆ పార్టీల అధినేతల వరకు ఎవ్వరిని ఉపేశించకుండా అధికారం ఉంది అనే అహంకారంతో తమ వెనుక జగన్ ఉన్నాడు అనే పొగరుతో నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఎన్నో అవమానాలకు గురి చేసారు వైసీపీ నేతలు.

ఇప్పుడు తమకు అవకాశం వచ్చింది వారికీ తిరిగిచ్చే సమయం ఆసన్నమయ్యింది అనుకున్న ఇరు పార్టీల మద్దతుదారులకు ఇప్పుడు వైసీపీ నేతలు ఒక్క్కొక్కరుగా బీజేపీ పార్టీలో చేరబోతున్నారు అనే వార్త తెలియడంతో బీజేపీ నాయకత్వం పై ఆగ్రహంగా ఉన్నారు టీడీపీ, జనసేన కార్యకర్తలు.

Also Read – జగన్‌కి గులక రాయి, ట్రంప్‌కి బుల్లెట్… ఎంతైనా అగ్రరాజ్యం కదా?

జగన్ భజన చేస్తూ బాబుని అవమానించిన విడుదల రజనీ, నందమూరి ఆడపడుచు, నారా వారి కోడలు అయిన బాబు సతీమణి భువనేశ్వరి ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొట్టిన వల్లభనేని వంశీ, టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన దేవినేని అవినాష్ వంటి నేతలందరూ బీజేపీ గూటికి చేరడానికి గట్టి ప్రణాళికే వేస్తున్నట్టు సమాచారం.

కూటమి బంధానికి, పొత్తు ధర్మానికి విరుద్ధంగా బీజేపీ ఇటువంటి నేతలకు తమ పార్టీలో చోటు కల్పిస్తే వైసీపీ కి పోయేదేమీ ఉండదు. ఇటువంటి నేతలను ఛీ కొట్టే కూటమి పార్టీల నేతలకు ప్రజలు జై కొట్టారు. ఇప్పుడు అదే నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటే ప్రజల నిర్ణయాన్ని అవమానించినట్టే అవుతుంది. అలాగే వైసీపీ ఫ్యాన్ గాలి కింద నుండి వస్తున్న ఈ నేతలు తమతో పాటుగా వైసీపీ వ్యతిరేకతను కూడా బీజేపీలో కలుపుతారు.

Also Read – కోడి కత్తి కేసు కూడా ఇలా బెడిసి కొట్టిందే!

మళ్ళీ ఎప్పుడైతే ఏపీలో జగన్ గాలి వీస్తుందో అప్పుడు నిర్దాక్షణ్యంగా బీజేపీ చెవిలో పువ్వు పెట్టి వైసీపీ గూటికి ఎగిరిపోవడం తథ్యం. ఇప్పుడిప్పుడే ఆంధ్రాలో బీజేపీ జెండా పట్టుకోవడానికి ముందుకొస్తున్న టీడీపీ క్యాడర్ అంతా మళ్ళీ బీజేపీకి దూరం కావడం ఖాయం. ఒంటరిగా బీజేపీ ఎప్పటికి ఏపీలో అధికారంలోకి రాలేని పరిస్థితి. టీడీపీ బలంతో జనసేన మద్దతుతో ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ ఇటువంటి సందర్భంలో వైసీపీ నేతలకు వలస కేంద్రంగా మారితే ఏపీ ప్రజలు బీజేపీ ని క్షమిస్తారా.?