యధారాజా… తధాప్రజా… జగన్ తో పాటే నేతలు కూడా..!

YCP MLA Raghurami reddy comments on TDP “యధారాజా తధాప్రజా” అన్నట్లు వైసీపీ అధినేత మాదిరే నాయకులు కూడా అనేక కేసుల్లో, అనుచిత వ్యాఖ్యలతో ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్న అక్రమాస్తుల కేసుల గురించి అందిరికీ తెలిసిందే. అలాగే, ‘చెప్పులతో కొట్టండి’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలకు కూడా జగన్ నిలయం. మరి అలాంటి పార్టీలో ఉన్న ఇతర నేతలు ఇంతకు మించిన గొప్ప పనులు ఏం చేస్తారులే అనుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని తాజాగా ఓ రెండు ఉదంతాలు చెప్తున్నాయి.

ADVERTISEMENT

కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత ఎస్ రఘురామిరెడ్డి ప్రభుత్వ అధికారులపై తన ‘బూతు పురాణం’ ప్రతిభను చాటిచెప్పారు. ప్రభుత్వం నిర్వహించిన ఏరువాకలో పాలుపంచుకున్న రఘురామిరెడ్డి… “వ్యవసాయ శాఖలో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు అంతా మోసపూరితమే. ఏ ఒక్క అధికారి కూడా నీతి నిజాయితీ ఎరుగరు. మీ కథ తేలుస్తా. చెప్పులతో కొట్టిస్తా. ఊళ్లోకి రానివ్వకుండా చేస్తా…” అంటూ ఆగ్రహంతో అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు. అలాగే సదరు ఎమ్మెల్యేను కారు దాకా సాగనంపేందుకు వెళ్లిన ఓ అధికారిపై బూతు పురాణం వినిపించారట. సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆవేదన చెందిన ఆ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే, ఇటీవలే కాంగ్రెస్ నుండి వైసీపీలోకి చేరిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణపై సతీమణి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కాల్ మనీ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న మురళీకృష్ణకు రెండు నెలల క్రితం వివాహం అయ్యింది. అయితే, పెళ్ళయిన నాటి నుండి తనను వేధింపులకు గురి చేస్తున్నారని రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దీంతో మురళీకృష్ణపై వేధింపుల కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. వీరిద్దరే కాదు, గతంలో ఎయిర్ పోర్ట్ లో ‘చెవిరెడ్డి అండ్ కో’ సృష్టించిన వీరంగం తెలియనిది కాదు. ఇలా పార్టీని ఎప్పుడూ వివాదాలతో హైలైట్ గా ఉంచడంలో పార్టీ అధినేతతో పాటు, పార్టీ నేతలు కూడా తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories