వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నెటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యారు. ఎంతో సంతోషంతో వేసిన ట్వీట్ లో “ఒక్కటి” మిస్ కావడంతో, నెటిజన్లు ఒక స్థాయిలో ఈ వైసీపీ ఎంపీని ట్రోల్ చేసారు. ఈ ట్రోలింగ్ దెబ్బకు చేసిన తప్పును గమనించిన విజయసాయి, ఆ ట్వీట్ డిలీట్ చేసి, ఈ సారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరో ట్వీట్ ను పోస్ట్ చేసారు.
ఇంతకీ డిలీట్ చేసిన ట్వీట్ లో ఏముంది అనుకుంటున్నారా? ట్వీట్ అయితే డిలీట్ చేయగలిగారు గానీ, అప్పటికే సోషల్ మీడియా అంతటా ఆ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ చక్కర్లు కొట్టేసాయి. కొత్త ట్వీట్ వేసినా గానీ, పాత ట్వీట్ స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసుకుంటూ తెలుగు తమ్ముళ్లు మరియు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా విజయసాయిని ట్రోల్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో దుబాయ్ ఎక్స్ పోలో “3150 రూపాయల” విలువలైన ఎంఓయూలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నాయని గర్వంగా ప్రకటించారు. ఏంటి దుబాయ్ కి వెళ్లి 3150 రూపాయల ఒప్పందాలు కుదుర్చుకున్నారా? అంటూ తెలుగుదేశం సోషల్ మీడియా నుండి సాధారణ నెటిజన్ల వరకు అందరూ ఒక్కటే ప్రశ్నలు.
3150 రూపాయల పెట్టుబడులు అంటే… సదరు మంత్రి గారు ఫ్లైట్ టికెట్ ఖర్చులు కూడా రావేమో అంటూ నెటిజన్లు చేసిన ర్యాగింగ్ మామూలుగా లేదు. జరిగిన పొరపాటును గమనించిన ఎంపీ, ఆ ట్వీట్ ను డిలీట్ చేసి ఓ అరగంట వ్యవధిలో మరో ట్వీట్ ను పోస్ట్ చేసారు. ఈ సారి 3150 “కోట్ల” విలువలైన ఒప్పందాలు అంటూ, మిస్సయిన ఆ “ఒక్క” పదాన్ని చేర్చారు.
Will that Rs.3150 be invested in one place or across Andhra Pradesh Prisionary A2 🧐🤔 pic.twitter.com/dtZc8dcePL
— Guru Dharanidhar Medasani (B -ve Blood Group) (@GuruDharanidhar) February 16, 2022



