
జగన్ ఢిల్లీలో చేసిన ధర్నాతో ఏపీలో తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల మద్య మొదలైన కొత్త యుద్ధం ఆలోచింపజేస్తోంది.
జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. కనుక కాంగ్రెస్‌తో స్నేహం లేదు. కానీ ఢిల్లీలో ధర్నాకి కాంగ్రెస్ మిత్రపక్షాలను ఆహ్వానించారు. వారు వచ్చారు కూడా.
Also Read – టీటీడీ నోటీసులతో వైసీపీ గురువు ఇబ్బంది
జగన్, కేసీఆర్ ఇద్దరూ జిగిరీ దోస్తులే. కానీ తన ధర్నాకి ఢిల్లీలోనే ఉన్న బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను ఆహ్వానించలేదు. వారు రాలేదు కూడా.
ఆప్త మిత్రుడిని కాదని సంబంధం లేనివారిని జగన్ పిలవడం, వారు వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపడం యాధాలాపంగా జరిగినవి కావనే భావించవచ్చు. జగన్ కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే కేసీఆర్ తన ఎంపీలను పంపలేదు.
Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?
అయితే జగన్ కాంగ్రెస్‌కు దగ్గరవ్వాలని అనుకుంటే అవొచ్చు. కానీ దానికి ఇంత డొంక తిరుగుడు అవసరం లేదు.
జగన్ నేరుగా సోనియా గాంధీ వద్దకు వెళ్ళి, ఆనాడు కాంగ్రెస్ పార్టీని వీడి ఏపీలో ఆ పార్టీని దెబ్బ తీసినందుకు, ఆమెను దూషించినందుకు క్షమాపణలు చెప్పుకొని, తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తానని అడగవచ్చు.
Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?
కానీ “నా ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వలేదు?” అని ప్రశ్నించడం తప్పు. అలా ప్రశ్నించి చెల్లి షర్మిలకి దొరికిపోయారు.
“అసలు కాంగ్రెస్ నీకెందుకు మద్దతు ఇవ్వాలంటూ” ఆమె ఘాటుగా ట్వీట్ వేశారు. ఆమె వాదన సహేతుకమే. అన్నని కాంగ్రెస్ అధిష్టానం ఆదరించి పార్టీలో చేర్చుకుంటుందేమో అనే ఆమె భయం కూడా సహేతుకమే. అందుకే ఆమె అంత ఘాటుగా స్పందిస్తున్నారని అనుకోవచ్చు.
ఆమె భయాలు అన్నకి కూడా తెలుసు. అవసరం తీరాక తల్లినే బయటకు సాగనంపిన జగన్‌కి కంట్లో నలుసులా మారి ఇబ్బంది పెడుతున్న చెల్లిని ఉపేక్షిస్తారని అనుకోలేము. కనుక ఆమెను హ్యాండిల్ చేసే బాధ్యత వైసీపి సోషల్ మీడియాకు అప్పగించిన్నట్లున్నారు.
అది యధాప్రకారం ‘జగన్ శత్రువులందరూ చంద్రబాబు నాయుడు మిత్రులే’ అనే ఫార్ములాతో వైఎస్ షర్మిలపై నిప్పులు చెరిగింది. ఆమెది ‘అక్రమ రాజకీయ సంబంధం’ అని అనేసింది.
అయితే ఎన్నికలకు ముందు షర్మిల అన్నపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా వైసీపి సోషల్ మీడియా ఇంతగా స్పందించలేదు. కానీ ఓటమి తర్వాత అన్నా చెల్లెలు ఈ స్థాయిలో పోరాడుకోవడం కాలక్షేపానికి కాదు. తల్లీపిల్లా కాంగ్రెస్ విలీనం ఆలోచనవల్లే జరుగుతోందని చెప్పవచ్చు.
వైసీపి ఆమెని ఉద్దేశ్యించి ఏమంటోందో మాటల్లోనే…
తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతీ సారి.. చంద్రబాబు బయటకు వస్తే ప్రజలు ప్రశ్నిస్తారన్న ప్రతీ సారి.. ఆ పార్టీని, బాబును కాపాడడానికి నేనున్నానంటూ ముందుకు వస్తున్న శ్రీమతి షర్మిలగారికి కొన్ని ప్రశ్నలు.
ఈ రాష్ట్రంలో రాజకీయపార్టీలతో అక్రమ సంబంధాలు ఉన్నవి చంద్రబాబుకు… https://t.co/7SK6xAsZk1
— YSR Congress Party (@YSRCParty) July 27, 2024