ysrcp-leaders-releasing-fee-poster

ఎప్పుడు నొక్కిన బటన్ల గురించి చెప్పుకునే జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తానూ చేసిన తప్పుల గురించి కానీ, వైసీపీ చేసిన అప్పుల గురించి కానీ ఆ ప్రభుత్వ హయాంలో ఎగొట్టిన బకాయిల గురించి కానీ ప్రస్తావించే సాహసం చేయగలదా.?

అధికారంలో ఉన్నన్నాళ్ళు దోచుకోవడం, దాడులు చేయడం, ప్రతిపక్షం నోరు నొక్కడం వంటి కార్యక్రమాలతో కాలక్షేపం చేసిన జగన్ ప్రతిపక్షంలోకి రాగానే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భాగోగులు అంటూ సుద్దపూస కబుర్లు చెప్పుకుంటూ ధర్నాలు, పోరాటాలతో బండి నెట్టుకొస్తున్నారు.

Also Read – అల్లు వారి ఇంట మెగా వివాదాలు…!

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యా దీవెన ఇవ్వడం లేదంటూ ఈ ఫిబ్రవరీ 5 న “ఫీజు పోరు” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైసీపీ నేతలు. అందుకుగాను ఫీజు పోరు అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్దమయ్యింది.

పేద విద్యార్థులకు చదువు, ఉద్యోగాలు అన్ని వైస్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అంటూ మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి జోగి వ్యాఖ్యలు లబ్దిదారులను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ మండిపడుతున్నారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ‘భిక్ష’ అంటూ జోగి నామకరణం చేస్తున్నారా.?

Also Read – ఏనాటి ద్వేషమిది.? కార్యకర్తల పాటి విలువ లేదా.?

అంటే లబ్దిదారులను వైసీపీ బిచ్చగాళ్ల మాదిరి భావిస్తుందా.? అంటూ జోగి వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. వైసీపీ పార్టీ ఆరోపణలు ఇలా ఉంటే అసలు వాస్తవాలు మరోలా ఉన్నాయంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన పేరుతో జగన్ చేసిన రాజకీయం భాగోతం మొత్తం చర్చకొచ్చింది.

2014 -19 టీడీపీ హయాంలో ఏటా 16 లక్షల మందికి ఫీజ్ రియంబర్స్ మెంట్ చేస్తే జగన్ పాలనలో ఆ సంఖ్యను కేవలం 9 లక్షలకు కుదించిన ఘనత జగన్ ది కాదా.? దాన్ని కూడా విడతల వారీగా చెల్లిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన నేరం వైసీపీ ది కాదా.? ఫీజ్ రీయింబర్స్ పేరుతో నేరుగా కళాశాలలకు చెల్లించే మొత్తాన్ని తన రాజకీయ లబ్ది కోసం విద్యా దీవెన పేరుతో తల్లితండ్రుల ఖాతాలకు మళ్లించి జగన్ చేసిన రాజకీయానికి ఏ పేరు పెట్టాలి.?

Also Read – వివేకా హత్యతో సంబందం లేకపోతే భయం దేనికి?

వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిల వలన డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ట్రిపిల్ ఐటీ, ఇతర కోర్సులు పూర్తి చేసినా ఉన్నత విద్య చదివే అవకాశం లేక పలువురు ఉద్యోగావకాశాలు కోల్పోయిన వైనాలు మరిచారా.? వైసీపీ పాలనలో విద్యా దీవెన అందని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసి ఆత్మ హత్యకు సిద్దమైన పరిణామాలు గుర్తులేవా.?

2021 – 22 4 వ క్యార్టర్ నగదు విడుదల చేయకపోవడంతో విజయవాడలో ఓ కాలేజీ 60 వేలు ఫీజు కట్టాలంటూ ఓ విద్యార్థిని యాజమాన్య సిబ్బంది ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా.? అలాగే డిసెంబర్ 17 2023 న నెల్లూరు జిల్లా కావలిలో ఫీజు రియంబర్స్ మెంట్ డబ్బులు అందలేదంటూ ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్థులు కళాశాల వెలుపలికి వెళ్లిన పాపం మీది కాదా.?

గత వైసీపీ ఎగొట్టిన పాపాల చిట్టా చూస్తే వసతి దీవెన బకాయిలు 989 కోట్లు,పీజీ ఫీజు రీఎంబెర్స్ మెంట్ బకాయిలు 450 కోట్లు గా తేలినప్పటికీ ఇంకా ఈ ఫీజు పోరు అంటూ పోరాటాలు చెయ్యడం వెనుక పరమార్ధం ఏమిటో.? పోరు అంటూ వైసీపీ నేతలు రోడ్డు బాట పట్టడం అంటే జగన్ పాలన మీద యుద్ధం చేయడమే అవుతుంది అనేది వైసీపీ గ్రహించలేకపోతుంది.

అయితే గత పాలకుల పాపాలను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పటికే 10 లక్షల విద్యార్థులకు గాను వారి విద్యార్దత మేరకు సర్టిఫికెట్లు అందించారు. అలాగే ఈ పతకం తాలూకా బకాయిల విషయంలో ఏ ఒక్క విద్యార్డుకి అన్యాయం జరగకూడదంటూ ప్రభుత్వం హెచ్చరికలు పంపింది.

గురివింద గింజ తన కింద అంతా నలుపు పెట్టుకుని ఎదుటివారి పై బురద జల్లాలని చూసినట్టు వైసీపీ కూడా తన ప్రభుత్వ హయాంలో వేల కోట్ల బకాయిలు పెట్టిపోయి ఇప్పుడు విద్యార్థులకు న్యాయం చేయండి, తల్లితండులా ఖాతాలో డబ్బులేయండి అంటూ పోరు బాట పట్టడం వైసీపీ నీచ రాజకీయానికి పరాకాష్ఠనే చెప్పాలి.