రాజకీయాలలో రాజకీయ నేతల మధ్య సిద్దాంత పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి అందరు సమానమే, సాధారణ మనుష్యులే అనేది వైసీపీ ఇంకెప్పటికీ తెలుసుకుంటుందో ఏమో కానీ దిగజారి విమర్శలు చేయడంలో పాతాళానికైనా వెళ్ళడానికి సిద్ధం అన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా పోస్టులు సాక్ష్యాలుగా కనపడుతున్నాయి.
టీడీపీ అధినేత కుమారుడు, టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు జనవరి 23. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు లోకేష్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. దానిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్రతో రాజకీయాలలో తనదైన మార్క్ వేసిన నారాలోకేష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ తెలియచేసారు.
అలాగే వైసీపీ సోషల్ మీడియా కూడా లోకేష్ కు బర్త్ డే విషెస్ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. దీనితో వైసీపీ రాజకీయంగానే కాదు సాధారణంగా కూడా ఏ స్థాయికి దిగజారిపోయిందో అనేది మరోసారి తెలుగు ప్రజలకు తెలియచేసింది. హ్యాపీ బర్త్ డే పప్పు లోకేష్ అంటూ పాలడబ్బా, బిస్కేట్స్, హార్లిక్స్ ఫోటోలను పోస్ట్ చేసింది.
రాజకీయాలలో ఉండే కనీస సంప్రదాయాలు – విలువలు కూడా పాటించలేని వైసీపీ పొద్దున్న లేస్తే “విలువలు విశ్వసనీయతే” మా ప్రధమ ఎజెండా అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తుంటారు. వైస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే రోజు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ కు బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తారు. ఇవి రాజకీయాలలో ఉండాల్సిన బేసిక్ విలువలు. వీటిని కూడా పాటించకుండా వైసీపీ సోషల్ మీడియా చేసిన పోస్ట్ ను జగన్ ఇప్పుడు సమర్థిస్తారా..?
ఇటువంటి నీచమైన పోస్టులు పెట్టి ఎవరిని రెచ్చకొట్టాలని భావిస్తున్నారో..? రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు సృష్టించాలని ఆశపడుతున్నారో..?ఎన్నికలకు రెండు నెలల ముందు ఇటువంటి రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవడం వెనుక అంతరార్థం ఏమిటో.?వైసీపీ నేతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు టీడీపీ నాయకులు.
ఇటువంటి పోస్టులు చూసి ఎవరి బీపీ లను పెంచాలని తొందరపడుతున్నారు అంటూ వైసీపీ నేతల పై విరుచుకుపడుతున్నారు టీటీడీపీ నాయకులు. టీడీపీ కూడా వైసీపీ నేతలకు ఇదే స్థాయిలో కౌంటర్ వేస్తే అప్పుడు వైసీపీ కార్యకర్తల బీపీలకు ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు ధ్వంసం కావాల్సిందేనా అంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.
అధికారం ఉంది కదా అని ఇటువంటి నిచ్ఛానికి దిగజారితే అధికారం ఎప్పుడు ఒకరికే శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి అనేది నిరంతర ప్రక్రియ అనేది వైసీపీ గుర్తిస్తే ఇటువంటి చర్యలకు పాల్పడదు అంటూ టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.




