గత సార్వత్రిక ఎన్నికలలో 151 అసెంబ్లీ, 23 ఎంపీ సీట్లు గెలుచుకొని ప్రభంజనం సృష్టించిన వైసీపి, ఈసారి ఎన్నికలలో ఎదురుదెబ్బ తినబోతోందని పలు మీడియా సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ గణాంకాలతో చెపుతున్నాయి.
ప్రముఖ సర్వే సంస్థ టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి ఏపీలోని 25 ఎంపీ సీట్లకు జరిగిన లోక్‌సభ ఎన్నికలలో టిడిపి కూటమి 50 శాతం (+/-3) ఓటు షేర్ సాధించి 22 సీట్లు (+/-3) గెలుచుకోబోతోందని తెలిపింది.
గత ఎన్నికలలో 25కి 23 ఎంపీ సీట్లు గెలుచుకున్న వైసీపి ఈసారి 40 శాతం (+/-3) ఓటు షేర్ సాధించి కేవలం 3 సీట్లు (+/-3) గెలుచుకోబోతోందని తెలిపింది.
ఈసారి కాంగ్రెస్ పార్టీ 4 శాతం (+/-3) ఓటు షేర్ సాధించినప్పటికీ ఒక్క సీటు (కడప నుంచి వైఎస్ షర్మిల) కూడా గెలుచుకోలేకపోవచ్చునని తెలిపింది.
ఇతరులు 6 శాతం (+/-3) ఓటు షేర్ సాధించినప్పటికీ వారు కూడా ఒక్క సీటు గెలుచుకునే అవకాశం లేదని తెలిపింది.




