ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక సంక్షోభంలో కురుకుపోయింది – ఇది స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర స్థితిగతులపై చెప్పిన మాట. గడిచిన కొద్దీ గంటలుగా ఈ అంశం వైరల్ అవుతోంది. మరి సంక్షోభానికి గల కారణాలను వివరించడంలో మాత్రం ముఖ్యమంత్రి గారు విఫలమయ్యారు అనేది రాజకీయ పరిశీలకుల మాట.
కరోనా థర్డ్ వేవ్ మరియు ఓమిక్రాన్ వేరియంట్ పై జరుగుతున్న ప్రచారం వలనే రాష్ట్ర ఆర్ధిక స్థితి మందగించినట్లుగా స్వయంగా సాక్షి మీడియాలోనే పేర్కొన్నారు. ఒకవేళ ఈ రెండు లేకపోతే ఇంకా వేగంగా పుంజుకునేదని ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు. అయితే ఇందులో అసలు లాజిక్ లేదనేది నెటిజన్లు సదరు సాక్షి ట్వీట్ కు రిప్లైలు ఇస్తూ సందడి చేస్తున్నారు.
ప్రస్తుత ఆర్ధిక స్థితికి కారణం గడిచిన ఆరు లేక ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. మరి సీఎం గారేమో భవిష్యత్తులో ఓమిక్రాన్ ఏదో చేస్తుందని, దాని వలనే బూతకాలంలో రాష్ట్రం ఆర్ధికంగా కుదేలు అయిపోయిందని చెప్పడంలో లాజిక్ లేదని నెటిజన్లు కొట్టిపడేస్తున్నారు. ‘సీఎం గారి కామెడీ’ అంటూ అనేక విధాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఏపీలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా థర్డ్ వేవ్ ఇంకా ప్రభావం చూపలేదు, ఓమిక్రాన్ అసలు ఉగ్ర రూపం దాల్చలేదు. ఓమిక్రాన్ ప్రభావం తెలియాలంటే రానున్న రెండు, మూడు మాసాలు చాలా కీలకం అని ప్రపంచ ఆరోగ్య సంస్థలు తెలుపుతున్నాయి. అంటే ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా ఓమిక్రాన్ ప్రభావం పెద్దగా పడలేదు.
ఒకవేళ సీఎం గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని భావించినా… ఓమిక్రాన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక ప్రకటన వచ్చి పట్టుమని పది రోజులు అయ్యుంటుంది, ఈ పది రోజుల్లోనే ఆర్ధిక స్థితి కుదేలు అయిపోయేటంతగా ఏపీలో ఏం జరిగింది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అయినా కరోనా గానీ, ఓమిక్రాన్ గానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ కే వర్తిస్తుందా? దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేయలేదా? మరి ఇండియాలో ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇలా చేతులెత్తేసారా? లేక ఏ రాష్ట్ర పరిస్థితి అయినా ఇంత ఘోరంగా ఉందా? అన్న సమాలోచనలను రాజకీయ పరిశీలకులు చేస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే, సెకండ్ వేవ్ లో మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ముందు కరోనా నియంత్రణలను సడలించిన ఘనత కూడా ఏపీ సీఎంకే దక్కిన విషయం బహిరంగమే. మరి కరోనా ప్రభావంతో ఆదాయం ఎలా తగ్గిపోయిందో సామాన్యులకు కూడా అర్ధమయ్యే రీతిలో వివరిస్తే జగన్ కే జనాలు జై కొట్టేవారేమో!
ఓట్లు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించకుండా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకుంటారేమో గానీ, మళ్ళీ ఓట్లు వేసేవరకు మాత్రం ప్రతి నాయకుడిని నిశితంగా గమనిస్తూనే ఉంటారు. ప్రజలు ఏ మాత్రం ఆలోచించరని భావిస్తే మాత్రం అది భంగపాటుకు గురయ్యే అంశమే… అది ఏ సామాజిక వర్గపు నేత అయినా..!
కరోనా థర్డ్‌వేవ్, ఒమిక్రాన్ వేరియెంట్‌పై జరుగుతున్న ప్రచారం వల్ల ఆర్థిక స్థితి కాస్త మందగించింది.. లేకపోతే ఇంకా వేగంగా పుంజుకునేది – వైఎస్ జగన్
— Sakshi TV (@SakshiHDTV) December 8, 2021



