ys-jaganreddy

“అక్రమస్తుల కేసులలో నేను 16 నెలలు జైల్లో ఉన్నాను. తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యాను” అని సగర్వంగా చెప్పుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్‌ రెడ్డి.

Also Read – పోలీస్ గడప దాటించి కోర్టుకి తీసుకువెళ్తే చాలు.. కేసు ఫినిష్!

అంతే కాదు… ఆ కేసుల కారణంగా ఎప్పుడు విదేశాలకు వెళ్ళాలన్నా సీబీఐ కోర్టు అనుమతి కోసం దరఖాస్తు చేసుకొన్న ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయనే.

అయితే అందుకు ఆయనేమీ సిగ్గు పడటం లేదు. పడితే ఆయనకే నష్టం. అందుకే సెప్టెంబర్‌ మొదటి వారంలో లండన్‌ వెళ్ళేందుకు అనుమతి కోరుతూ జగన్‌ సీబీఐకి దరఖాస్తు చేసుకున్నారు.

Also Read – జాక్ అండ్ లైలా: రెండు స్పీడ్ బ్రేకర్లే

నాంపల్లి, సీబీఐ కోర్టు నేడు దానిపై విచారణ జరుపనుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విదేశీ పర్యటనకు అనుమతించినందున ఈసారి కూడా అనుమతించే అవకాశం ఉంది.

జగన్‌తో పాటు అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉన్న విజయసాయి రెడ్డి కూడా యూరప్ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ డిసెంబర్‌లోగా సుమారు 60 రోజులు యూరప్‌లో పర్యటించేందుకు అనుమతి కోరారు.

Also Read – విశాఖ మేయర్‌ పీఠం కూటమికే… సంతోషమేనా?

ఆయన పిటిషన్‌పై విచారణని సీబీఐ కోర్టు ఆగస్ట్ 30కి వాయిదావేసింది. విజయసాయి రెడ్డి నిత్యం ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతుంటారు కనుక బహుశః ఆయనకీ అనుమతి లభించడం ఖాయమే అనుకోవచ్చు.

ఎన్నికలలో వైసీపి ఓడిపోయిన తర్వాత పార్టీ శ్రేణులకు అండగా నిలబడి ధైర్యం చెప్పాల్సిన జగన్మోహన్‌ రెడ్డి బెంగళూరు ప్యాలస్‌లో ఎక్కువగా గడుపుతుండటం విశేషం. ఈ రెండు నెలల్లోనే ఆరుసార్లు బెంగళూరు వెళ్ళి వచ్చారు. ఇప్పుడు లండన్‌ పర్యటనకు బయలుదేరేందుకు బ్యాగులు సర్దుకుంటున్నారు.

ఇదివరకు జగన్‌ జైల్లో ఉన్నప్పుడు వైసీపిని ఆయన తల్లీ, చెల్లీ కాపాడేవారు. కానీ వారిద్దరినీ జగన్‌ స్వయంగా బయటకు పంపించారు. సజ్జల రామకృష్ణా రెడ్డిని కూడా పక్కన పెట్టేశారు. విజయసాయి రెడ్డి కూడా విదేశాలలో సేద తీరి రావాలనుకుంటున్నారు.

కనుక జగన్‌ బెంగళూరు-లండన్‌లో సేద తీరుతున్నప్పుడు వైసీపిని ఎవరు నడిపిస్తారో తెలీని పరిస్థితి. పెద్దిరెడ్డి, జోగి రమేష్, ద్వారంపూడి వైసీపిలో ప్రతీ ఒక్కరికీ స్పెషల్ కేసులున్నందున ఎవరూ పార్టీ బాధ్యతలు భుజంపై వేసుకొని పనిచేసే పరిస్థితి లేదు.




వైసీపిలో నంబర్ :2 స్థానానికి జగన్‌ ఇంకా ఎవరినీ రిక్రూట్ చేయలేదు. కనుక తక్షణమే ఆ బాధ్యతలు కొడాలి నాని, అంబటి రాంబాబు లేదా రోజా ముగ్గురిలో ఎవరో ఒకరికి అప్పగిస్తే వాళ్ళు తప్పకుండా వైసీపిని మళ్ళీ ఫుల్ ఫోకస్‌లోకి తీసుకురాగలరు.