ఇగో పక్కన పెట్టకపోతే కష్టం జగన్

YS Jagan- Egoరాజకీయాలలో ఇగో అనేది ఒక నాయకుడికి అసలు ఉండకూడని లక్షణం. వాసుదేవుడు అంతటి వాడికే గాడిద కాళ్ళు పట్టుకోవడం తప్పలేదు. రాజకీయనాయకులకు అంతకంటే ఎక్కువే చెయ్యాల్సి రావొచ్చు. అయితే జగన్ మోహన్ రెడ్డిది మాత్రం విలక్షణమైన మనస్తత్వం. కిందపడినా నాదే పైచేయి నేను అసలు తగ్గను అంటారాయన.

2019 సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఖాళీగా ఉన్న సీనియర్ నాయకుల వైపు చూస్తున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి వైకాపా వైపు చూస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. అలంటి తరుణం ఆయన సోదరుడు వివేకా కాలం చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వదిలేసి వెళ్లి పరామర్శించారు. అయితే జగన్ మాత్రం ఫోన్ చేసి ఊరుకున్నారు.

ADVERTISEMENT

మరోవైపు సబ్బం హరిని తమ పార్టీలోని తెచ్చుకోవడానికి బీజేపీ, టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. చంద్రబాబు, వెంకయ్య నాయుడు డైరెక్టుగా ఆయనతో మాట్లాడారట. అయితే జగన్ మాత్రం తాను మాట్లాడకుండా వేరే వాళ్లతో మాట్లాడిస్తున్నారట. గతంలో సబ్బం జగన్ కు ఆప్తుడు ఎన్నికల ముందు ఆయనతో విభేదించి బయటకు వచ్చేసారు.

అయితే సబ్బం లాంటి మంచి వక్త ఏ పార్టీకైనా పెద్ద ప్లస్ పాయింట్ అన్నట్టే. కేవలం ఇగో వల్ల ఆయనను దూరం చేసుకుంటున్నారు జగన్. 2019 ఎన్నికలు వైకాపాకు చావో రేవో వంటివి. ఇలాంటి తరుణంలో ఇటువంటి మనస్తత్వంతో జగన్ ఆయనకు గానీ ఆయన పార్టీకి గానీ ఎలాంటి మేలు చేసుకోవడం లేదు.

ADVERTISEMENT
Latest Stories