జగన్ చేతికి అంటిన తిరుమల కల్తీ నెయ్యి వాసన ఇంకా పోనే లేదు. ఈలోగా అదానీ-జగన్ ఎపిసోడ్ మొదలైపోయింది. రూ.1,750 కోట్లకు కక్కుర్తిపడి రాష్ట్రంపై, ప్రజలపై పెను భారం మోపావుగా అన్నా? నువ్వు అవినీతికి పాల్పడకపోయుంటే నీ పిల్లల మీద ప్రమాణం చేస్తావా?” అంటూ రాఖీ కట్టిన ప్రియమైన చెల్లి వైఎస్ షర్మిల ప్రశ్నిస్తోంది.
మరోపక్క అదానీ వ్యవహారంపై అక్కడ పార్లమెంటు దద్దరిల్లిపోతూనే ఉంది. ఎంతో రాజకీయ, పరిపాలనానుభవం ఉన్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సైతం ఇది చూసి ఆశ్చర్యపోయారు.
Also Read – మంచులో అందరూ మంచివాళ్ళే కానీ…
ఇటువంటి సందర్భాలలో ఎదురుదాడి చేసి తప్పించుకోవడం జగన్‌కి వెన్నతో పెట్టిన విద్యే. కనుక నేడు తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి వితండవాదం చేశారు.
ఇది కేంద్రానికి (సెకీ), రాష్ట్రానికి మద్య జరిగిన చారిత్రాత్మకమైన ఒప్పందమని, దీనిలో మూడో పార్టీ (అదానీ) ఎక్కడున్నారని జగన్ ప్రశ్నించారు.
Also Read – కేసీఆర్, జగన్, రేవంత్ చారిత్రిక తప్పిదాలు… మూల్యం పెద్దదే!
తన హయంలో ఏపీలో రైతుల పట్ల చూపుతున్న శ్రద్దని కొనియాడుతూ సెకీ నుంచి 2021, సెప్టెంబర్ 15న ఓ లేఖ వచ్చిందని, దాని ఆఫర్‌పై మంత్రివర్గంలో చాలా లోతుగా చర్చించిన తర్వాత దాని వలన రాష్ట్రానికి ఏడాదికి రూ.4,000 కోట్లు, 25 ఏళ్ళలో లక్ష కోట్లు కలిసి వస్తాయని గ్రహించి సంతకం పెట్టామని జగన్ చెప్పారు.
ఒకవేళ ఆనాడు నేను సంతకం పెట్టకపోయి ఉండి ఉంటే దానికీ చంద్రబాబు నాయుడు నన్ను నిందించకుండా ఉంటారా? అని జగన్ ఎదురు ప్రశ్న వేశారు.
Also Read – సీక్వెల్స్: వైఫల్యం నుండి విజయం వరకు
కనుక రాష్ట్రానికి లక్ష కోట్ల సంపద సృష్టించి ఇచ్చినందుకు నాకు శాలువా కప్పి సన్మానం చేయాలి లేదా ఏ అవార్డో ఇచ్చి ఉండాలి. కానీ నేను ఏదో అవినీతికి పాల్పడిన్నట్లు నాపై బురద జల్లుతున్నారు. నేను రాష్ట్రానికి సంపద సృష్టించి ఇస్తే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు దానిని ఆవిరి చేసేస్తున్నారని జగన్ ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతోనే రాష్ట్ర ప్రజలపై పెను భారం పడుతుందని, తాను చేసుకున్న ఈ ఒప్పందంతో చవుకగా రాష్ట్రానికి విద్యుత్ లభించబోతోందని జగన్ బల్ల గుద్ది వాదించారు.
ఒకవేళ జగన్ చెప్పిననట్లు అంత చవుకగా అంటే యూనిట్ రూ.1.98లకే వస్తుందంటే, నిజంగానే చంద్రబాబు నాయుడు ఆయనకు సన్మానం చేయాలి. కానీ ‘సెకీ’తో మాట్లాడి ఆ విద్యుత్ భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారంటే అర్దం ఏమిటి?
ఒకవేళ ఇంత చవుకగా విద్యుత్ సరఫరా చేసే మాటయితే ఆదానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ఎందుకు అమ్మాలనుకుంటారు? తన స్వంత రాష్ట్రమైన గుజరాత్ లేదా ఇంకా ఎక్కువ ధర చెల్లిస్తామని పోటీ పడే మరో రాష్ట్రానికి అమ్ముకునేవారు కదా?
ఇంత చవుకగా విద్యుత్ అందిస్తున్నప్పుడు మళ్ళీ రూ.1,750 కోట్లు లంచాలు ఎందుకు చెల్లిస్తారు?ఇంత తక్కువ ధరకు విద్యుత్ ఇస్తామంటే ప్రభుత్వమే ఆయనకు రాయితీల పేరుతో ఎంతో కొంత ముట్టజెప్పాలి కదా? అదానీ-జగన్ మద్య ఏమీ జరుగకుండానే అమెరికా కోర్టులో కేసు నమోదు అవుతుందా?
ఇంత నిర్వాకం చేసి “నాకు శాలువా కప్పి సన్మానం ఎందుకు చేయలేదు?” అని అడగడం కేవలం జగన్‌కే చెల్లునేమో?