ఎన్నికలు దగ్గర పడేకొద్దీ జగన్ తనమీద, తన పాలన మీద, తన నాయకుల మీద నమ్మకాన్ని కోల్పోయి చివరికి వాలంటీర్లను, సినిమాలను నమ్ముకునే పరిస్థితికి దిగజారిపోయారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
Also Read – అధికారం కోసం చిచ్చు పెట్టడం నైతికమేనా… ఏ-1, ఏ-2?
మా పాలనలో మీకు, మీ కుటుంబానికి మంచి జరిగితేనే మాకు ఓటేయండి అంటూ బహిరంగ వేదికల మీద చెపుతున్న ముఖ్యమంత్రి, ఆయన భజన గణం తెరవెనుక మాత్రం మా విజయం మీ చేతులలోనే ఉందంటూ వాలంటీర్లను, సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది దర్శకుల ముందు మోకరిల్లుతున్నారు.
అయితే మా విజయానికి మీరు సహకరిస్తే మీ ఉన్నతికి మాది గ్యారంటీ అనే విధంగా ఎక్కడిక్కడ క్విడ్ ప్రోకో పద్దతిని అమలుచేస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ కి అనుకూలంగా పని చేస్తే మీకు ఈ రెండు నెలలు అదనంగా 30 వేలు, పెట్రోల్ చార్జీలు, ఎన్నికలలో గెలిచిన తరువాత మీ కుటుంబానికి విహార యాత్ర అంటూ వైసీపీ నాయకులు, మంత్రుల నుండి వాలంటీర్ స్థాయి వైసీపీ కార్యకర్తలకు ఇప్పటికే తాయిలాలు అందిన వార్తలు మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
Also Read – మార్పు ‘ఉనికి’ని ప్రశ్నిచకూడదుగా..?
5 వేలు జీతం ఇచ్చే వాలంటీర్లనే ఈస్థాయిలో ప్రలోభాలకు గురిచేస్తే, ఇక తనను హీరోగా, ఒక ఉన్నత విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, ఎంతోమంది బడా నాయకులను ఎదించిన ధీరుడిగా, ప్రజల కోసమే జన్మించిన మహానుభావుడిగా వెండి తెర మీద చిత్రీకరించిన యాత్ర దర్శకుడు మహి వి రాఘవ కు ఇంకెంత స్థాయి బహుమతులు అందాయో..? ఇప్పుడు తెలుసుకుందాం.
2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జగన్ పాదయాత్ర ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేయగలిగిందో అనే అనుమానంతో తన తండ్రి వైస్సార్ చేసిన పాదయాత్రను ‘యాత్ర’ రూపంలో వెండి తెరమీద ఆవిష్కరించి ఒక్కచాన్సు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు జగన్. అయితే మరో ఛాన్స్ కోసం కూడా అదే దర్శకుడి మీద భారం వేసి సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు తన ఐదేళ్ల తన పాలన మీద నమ్మకం లేక మళ్ళీ 2019 ఎన్నికలకు ముందు తానూ చేసిన పాదయాత్రను యాత్ర 2 రూపంలో వెండితెర మీదకు తెచ్చారు.
Also Read – అవసరం లేనప్పుడు రివర్స్ గేర్.. ప్రమాదమేగా?
అయితే దీనికి ప్రతిగా ఈ రెండు సినిమాలతో తనను హీరోగా చూపించిన యాత్ర దర్శకుడు మహి వి రాఘవ కు జగన్ బారి నజరానానే ముట్టచెప్పిందని కొన్ని మీడియా ఛానెల్స్ లో కథనాలు ప్రచారమయ్యాయి. వాటి ఆధారంగా చూస్తే., హార్సిలీ హిల్స్ లో మినీ స్టూడియో నిర్మాణం పేరుతో సుమారుగా 20 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిని మహి వి రాఘవ కు జగన్ సర్కార్ దారాదత్తం చేసేస్తుంది అని కథనాలు రావడంతో రాష్ట్రంలో ఇప్పుడివార్త హాట్ టాపిక్ గా మారింది.
యాత్ర 2 షూటింగ్ కు ముందు జగన్ సర్కారుకు దరఖాస్తు పెట్టుకున్న దర్శకుడు కి చిత్రీకరణ మొదలుకాగానే ఒక్కొక్కటిగా ఫైల్స్ కదులుతూ చివరికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే సరికి హార్సిలీ హిల్స్ లో 2 ఎకరాల స్థలం మహి కళ్ళముందుకొచ్చేలా సీఎం కార్యదర్శి రూట్ మ్యాప్ క్లియర్ చేసారు. దీనితో జగన్ క్విడ్ ప్రోకో ఈస్థాయిలో ఉంటుందా..? అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
కేవలం యాత్ర కు సంబంధించిన సినిమాలతో తప్ప మరో రకంగా ఎటువంటి గుర్తింపు కానీ, అనుభవం కానీ లేని దర్శకుడికి, తనను హీరోగా చూపించాడు అనే ఒకేఒక కారణంతో 20 కోట్లకు సంబంధించిన ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ భూమిని దారాదత్తం చేయడం అంటే ”అత్త సొమ్ము అల్లుడు దానం” అనే సామెత గుర్తొస్తుంది.
అలాగే తన ప్రాపకం కోసం ఇంత విలువైన భూమిని ఒక వ్యక్తికీ కట్టబెట్టడమంటే ఒక సినిమా టికెట్ కొన్నంత, అమ్మినంత ఈజీ అయిపోయిందా ఈ ప్రభుత్వానికి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. ‘తనను హీరోను చేసినందుకు ప్రజలను ఇంత ఫూల్స్ చేయాలా’….ముఖ్యమంత్రి గారు అంటూ ఈవార్తను వైరల్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు.
అధికారం ఉంది కదా అని తమ సొంతానికి ప్రభుత్వ ఆస్తులను తమకు నచ్చిన, తమను మెచ్చిన వ్యక్తులకు కట్టబెట్టేటందుకు మరో ఛాన్స్ కావాలా..? తనను హీరోగా చూపించిన దర్శకుడికి 20 కోట్ల ఆస్తిని కట్టబెడితే ప్రతిపక్ష పార్టీల నేతలను కించపరుస్తూ కనీస విలువలు పాటించని మరో దర్శకుడికి ఇంకెంత ఎంతమొత్తంలో ముట్టచెప్పారో..? అంటూ వైసీపీ ప్రభుతం పై పలు సందేహాలు మొదలయ్యాయి.