గేమ్ స్టార్ట్స్… వెలుగు చూస్తున్న జగన్ భూదందాలు?

ys Jagan-YS Avinash Reddyఎప్పుడైతే ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను అధికార తెలుగుదేశం ప్రభుత్వం సీరియస్ గా పరిగణించిందో, అప్పటినుండి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఒక్కసారిగా వేడెక్కిన పొలిటికల్ వాతావరణంలో జగన్ మీడియా ‘సాక్షి’ ప్రచురించిన ‘భూదందాల’ కధనం మరింత అగ్గిని రాజేసింది. దీంతో మరోసారి ప్రతిపక్ష – అధికార పక్షాల మధ్య ఆధిపత్య పోరుకు రంగం సిద్ధమైంది.

ADVERTISEMENT

సాక్షి మీడియాపై విరుచుకుపడ్డ తెలుగుదేశం నేతలు, ‘దొనకొండ’ను జగన్ ఎందుకు రాజధానిగా కావాలనుకుంటున్నారో కూడా వివరంగా చెప్పారు. దొనకొండ పరిసర ప్రాంతాల్లో జగన్ కు మరియు వారి బినామీలకు, అనుచరవర్గానికి వందల, వేల ఎకరాలు ఉన్నాయని, అందుకే అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసారు. అయితే దీనికి సంబంధించి తాజాగా ఒక మీడియా ఛానల్ ప్రత్యేక కధనాలు ప్రసారం చేసింది.

ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతాల్లో జగన్ అనుచర వర్గాలు వందలాది ఎకరాలు కొనుగోలు చేసారంటూ ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిటీ మొదటి ఛాయిస్ గా దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడంతో, ముందుగానే వీరంతా బినామీలుగా ఏర్పడి వందలు, వేలాది ఎకరాలు సొంతం చేసుకున్నారని ఈ కధనాల సారాంశం. నిజానికి అప్పట్లోనే ఈ విషయం వెలుగు చూసినప్పటికీ రాజకీయ వర్గాలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ, ఎప్పుడైతే సాక్షి ప్రచురించిన కధనాలు హీట్ పుట్టించాయో, అప్పటినుండి “గేమ్” ప్రారంభమైంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories