జగన్ ఒక “తెలివైన” ఆలోచన చేసారు!

YS Jagan Mohan Reddy-YSRCPతను అనుకున్నది మూర్ఖంగా, మొండితనంగా చేసుకుని వెళ్ళిపోవడం తప్ప, మరే ఇతర ఆలోచనలకు వైసీపీ అధినేత జగన్ ఆస్కారమివ్వరని రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. జగన్ చేసే ఆలోచనలు, చర్యలే ఈ అభిప్రాయాలకు ఆస్కారం కల్పిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అలాంటి జగన్ ఒక తెలివైన, పార్టీ గౌరవాన్ని కాపాడే నిర్ణయం ఒకటి తీసుకున్నారని పొలిటికల్ వర్గాల టాక్.

తెలంగాణాలో జగన్ పార్టీ జెండా పట్టుకునే వారు కూడా లేరన్నది బహిరంగ విషయమే. పార్టీలో గెలిచిన వారు కూడా టీఆర్ఎస్ బాట పట్టడంతో తెలంగాణాలో పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యింది. అయితే ఈ తరుణంలో ఖమ్మం జిల్లా పాలేరులో ఉప ఎన్నికల నగారా మ్రోగింది. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం తర్వాత ఏర్పడిన స్థానానికి నోటిఫికేషన్ వెలువడింది. అయితే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైనా బరిలోకి దిగితే పోటీకి దిగమంటూ వైసీపీ పొంగులేటి ద్వారా ఒక అధికారిక ప్రకటన చేయించింది.

ADVERTISEMENT

వైసీపీ సహకారం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క జగన్ ను కలిసి చర్చించారు. దీని తర్వాత పొంగులేటి ద్వారా వైసీపీ అధికారిక ప్రకటన ఇప్పించింది. కాంగ్రెస్ ప్ర‌తిపాదించిన అభ్య‌ర్థికి వైసీపీ మ‌ద్ద‌తు తెలుపుతూ, గత సాంప్ర‌దాయాల్ని పాటిస్తామ‌ని పేర్కొంది. ఈ ఉప ఎన్నికలో రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితను బరిలోకి దింపాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

బరిలోకి దిగి పరువు పోగొట్టుకునే బదులు, ఎన్నికల నుండి తప్పుకోవడమే సరైన నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందులోనూ జగన్ కూడా ‘వారసత్వం’ పైన ఆధారపడి వచ్చిన వ్యక్తి కావడంతో, మళ్ళీ ‘వారసత్వం’ ప్రక్రియకు గండి పడుతుందనే ఉద్దేశంలో కూడా కాంగ్రెస్ కు సహకారం అందించి ఉండవచ్చని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తమ్మీద ‘యువనేత’ ఈ సారి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం పట్ల రాజకీయ వర్గాలు ఆశ్చర్యం ప్రకటిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories