ఒకసారి జగన్ రాజకీయం ముందు నుండి పరిశీలిస్తే నీకేంటి..నాకేంటి? నీకెంతా..నాకెంత? అనే వ్యాపార ధోరణిలో కొనసాగుతూవస్తుంది. తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన శవాన్ని అడ్డుగా పెట్టుకుని అప్పటి కాంగ్రెస్ నాయకుల వద్ద తన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సంతకాల సేకరణ చేసారు జగన్.

Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?

మీరు నా నాయకత్వాన్ని ఆమోదిస్తే నాకు ముఖ్యమంత్రి పదవి, మీకు మంత్రి పదవి అంటూ నాయకులతో భేరాలాడిన జగన్, కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మీకెంత నాకెంత అంటూ తన పదవి కోసం భేరాలు మొదలుపెట్టారు అనే వార్త అప్పటి రాజకీయాలలో సంచలంగా మారింది.

అయితే కాంగ్రెస్ పార్టీతో తెగని భేరంతో ఇక సొంత పార్టీ వైస్సార్ కాంగ్రెస్ ఏర్పాటు చేసి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక ఇక్కడి నుండి జగన్ భేరమంతా ప్రజలతోనే కొనసాగింది. నేను మీ కోసం ఓదార్పు యాత్ర చేశాను, పాదయాత్ర చేశాను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీకు నవరత్నాలు ఇస్తాను అంటూ భేరం కుదుర్చుకున్నారు.

Also Read – మిల్వాకీ లో ATA ఉమెన్స్ డే మరియు ఉగాది వేడుకలు

ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘నేను బటన్ నొక్కాను’, వై నాట్ 175 , నాకు మీరంతా ఓటెయ్యాలి అంటూ మరోకొత్త పంధా మొదలుపెట్టారు. అలాగే 2019 ఎన్నికలలో పరోక్షంగా వైసీపీ గెలుపుకి కారణమైన బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు కూడా తాను ముఖ్యమంత్రి కాగానే కొన్ని కోట్ల ఏపీ ప్రజల ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి దారాదత్తం చేసి బిఆర్ఎస్ పార్టీకి మేలు చేసారు.

అలాగే గత ఐదేళ్లుగా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రవేశ పెట్టిన అన్ని బిల్లులకు ఎటువంటి షరతులు లేకుండా మద్దతిచ్చారు జగన్. తన ఒక్క ఛాన్స్ కోరిక తీర్చినందుకు పరోక్ష మద్దతిచ్చిన ఈ రెండు పార్టీలకు తనవంతు సహకారం అందిస్తూ లెక్క సరిచేశారు జగన్. అయితే ఇక్కడితో జగన్ తన భేరాలకు శుభం కార్డు వెయ్యలేదు.

Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?

ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నాను కాబట్టి కోర్టుకు హాజరుకాలేను, ఈ విషయమై తనకు మినహాయింపు కావాలంటూ న్యాయస్థానాలతో లాలూచి మొదలుపెట్టారు. అలాగే ఈ 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమితో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదు.

అయితే తానూ అసెంబ్లీకి రావాలంటే ఇప్పుడు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఇప్పటి కూటమి ప్రభుత్వంతో భేరసారాలాడుతున్నారు జగన్. ప్రజాస్వామ్యంలో తన బాధ్యత తానూ నిర్వర్తించడానికి ఈ జగన్ చేస్తున్న ఈ రాజకీయానికి ఏ పేరు పెట్టాలి..బెదిరింపా? భేరమా.?