స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఒక సామాజిక వర్గాన్ని మంచి చేసుకోవటానికి, ఎన్టీఆర్ ను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు అని, ఆయన సేవలకు గుర్తింపుగా, కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు మారుస్తా అంటూ ప్రకటన చేశారు విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే చంద్రబాబును ఇరుకున పెడదాం అనుకుంటే అది ఆయనకే తలపోటుగా మారింది.
“కృష్ణా జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తున్నాం. ఎంతోమంది జీవనాధారమైన కృష్ణానది పేరు మార్చితే సహించం. జగన్ ఇచ్చిన హామీని ఉపసంహరించుకోవాలి. జగన్ నిర్ణయం మార్చుకోకుంటే పార్టీకి రాజీనామా చేసి ఉద్యమిస్తాం,” అని వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు హెచ్చరించారు.
దుట్టా రామచంద్రరావు, గన్నవరం నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు… పోయిన ఎన్నికల్లో వల్లభనేని వంశీతో పోరాడి ఓడిపోయారు. జగన్ చేసిన ప్రకటనపై ఆ పార్టీలోని రెడ్డి సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు కాపు సామాజిక నేతలు వంగవీటి రంగా పేరు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నారు.



