
జగన్ తాను ఎప్పుడూ చాలా తెలివిగా రాజకీయాలు చేస్తున్నానని, అద్భుతమైన వ్యూహాలతో తన ప్రత్యర్ధులను దెబ్బ తీసి పైచేయి సాధిస్తున్నానని భ్రమలో ఉంతయారు. పార్టీ నేతలను, ప్రజలను కూడా భ్రమింపజేయాలని ప్రయత్నిస్తుంటారు.
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
కానీ హనుమంతుడి ముందు కుప్పి గంతులా… అన్నట్లు కేసీఆర్‌కే సైలంట్‌గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసిన చంద్రబాబు నాయుడు ముందు జగన్ వ్యూహాలు పనిచేస్తాయా?
ఇందుకు తాజా ఉదాహరణగా.. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి నిన్న విశాఖకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, “సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ గట్టిగా పట్టుబట్టడం వలననే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టి నిధులు విడుదల చేయడమే కాకుండా, దానికి పునరుజ్జీవనం కల్పించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్దపడిందని,” చెప్పారు.
Also Read – చెప్పేవి శ్రీరంగ నీతులు…చేసేవి వైసీపీ రాజకీయాలా.?
కుమారస్వామి ఈ విషయం చెపుతున్నప్పుడు ఆయన పక్కన సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ లేరు. లేకపోయినా తమపై బురద జల్లబోయిన జగన్‌కి చెప్పుతో కొట్టిన్నట్లు చేశారు కదా?
జగన్ ఓడిపోయినప్పటి నుంచి ‘నేను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటేనా..’ అంటూ కలలుకంటూ సంక్షేమ పధకాల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో అవినీతి, హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, కనుక కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో నానాటికీ వ్యతిరేకత పెరిగిపోతోందని జగన్ ప్రచారం చేయిస్తూనే ఉన్నారు.
Also Read – బొత్సగారు.. మీ అనుభవమే వృధా అవుతోంది!
అయితే ఈ దుష్ప్రచార వ్యూహం కూడా బెడిసి కొట్టబోతోంది. ఇదే ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పాలిట శాపంగా మారబోతోంది.
వైసీపీ వాదనలు నిజమని నిరూపించుకోవాలంటే త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ బాలపరిచిన ముగ్గురు అభ్యర్ధులను గెలిపించుకొని తీరాలి. టీడీపీని ఓడించి తీరాలి. లేకుంటే చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలలో ఎటువంటి వ్యతిరేకత లేదని నిర్ధారణ అవుతుంది.
అయితే ఓటమి భయంతోనే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండిపోయింది. కనుక ఇప్పుడు జరుగబోయే రెండు పట్టభద్ర, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అనుకూల అభ్యర్ధులకు మద్దతు ఇచ్చి వారు ఓడిపోతే వైసీపీ తలెత్తుకోలేదు.
ముఖ్యంగా త్వరలో జగన్ పాదయాత్రలతో ప్రజల మద్యకు రావాలనుకుంటున్నవేళ మరో ఓటమి మంచిది కాదు. ఒకవేళ ఎన్నికలకు దూరంగా ఉండిపోతే ఓటమి భయంతోనే పోటీ చేయడానికి భయపడుతోందని టీడీపీ నేతలు దెప్పకుండా ఉండరు.
ఒకవేళ ధైర్యం చేసి అభ్యర్ధులని బరిలో దించి గెలిపించుకున్నా దాని వలన వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది తప్ప వారి వలన వైసీపీకి ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఒకవేళ వారు గెలిచినా తర్వాత కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపితే వైసీపీ వ్యయప్రయాసలు వృధా అయిపోతాయి.
కనుక చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో సర్వనాశనం అయిపోతోందని, ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగిపోయిందంటూ చేసిన దుష్ప్రచార వ్యూహమే ఇప్పుడు వైసీపీ మెడకు ఉరితాడుగా మారబోతోంది.
అదే.. ఓ ఆరు నెలలు సంయమనం పాటించి ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించినా, నిలదీయడం మొదలుపెట్టినా వైసీపీకి ఇటువంటి సంకట పరిస్థితి ఎదురయ్యేదే కాదు కదా?