YS Jagan Protest In Delhi

నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపుల పై దేశం మొత్తం ఏపీ గురించి గొప్పగా చర్చించుకుంటున్న వేళ నేడు జగన్ మోహన్, మధన్ హస్తినలో చేస్తున్న నిరసనలతో ఏపీ పరువు ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం లేకపోలేదు.

సొంత పార్టీలో ఇద్దరు కార్యకర్తల మధ్య జరిగిన ఘటనను రెండు పార్టీల మధ్య గొడవగా చిత్రీకరించి ఏపీలో భద్రత కరువయ్యింది అంటూ ఢిల్లీలో గళమెత్తారు జగన్. వైసీపీ ఎంపీ విజయసాయి తో కలిసి తన భార్య తనను మోసం చేసి బిడ్డను కనిందని దానికి తనకు న్యాయం చేయాలంటూ శాంతి భర్త మధన్ పార్లమెంట్ ఎదుట విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.

Also Read – సిఎం చంద్రబాబు నాయుడుకి కేశినేని నాని విజ్ఞప్తి

టీడీపీ అప్రజాస్వామ్యంగా వైసీపీ కార్యకర్తల మీద దాడికి తెగబడింది అంటూ జగన్ ఆరోపిస్తుంటే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పరపతిని ఎరగా వేసి, డబ్బుందనే అహంకారంతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన కుటుంబాన్ని నిట్టనిలువునా చీల్చి తనకు, తన పిల్లలకు అన్యాయం చేసారంటూ మధన్ ఆరోపిస్తున్నారు.

ఏపీలో జరుగుతున్న ఈ హత్యా రాజకీయాలకు చెక్ పెట్టాలి అంటే రాష్ట్రంలో రాష్టప్రతి పాలనే శరణ్యమంటూ జగన్ గగ్గోలు పెడుతుంటే, రాష్ట్రంలో అతి సామాన్య కుటుంబాలకు కూడా వైసీపీ నేతల వలన రక్షణ కరువవుతుంది అంటూ మధన్ వాదిస్తున్నారు. సొంత పార్టీలో ఏర్పడిన సమస్యను పరిష్కరించుకోలేక జగన్ ఈ హత్యకు కారణమయ్యారు.

Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!

అసలు తన కుటుంబంలో ఎం జరుగుతుంది, తన భార్య ఎలా ప్రవర్తిస్తుంది అనేది గమనించుకోకుండా మధన్ ఈ సమస్యను పెంచి పోషించారు. ఇద్దరి వ్యక్తుల నిర్లక్ష్యం, ముందు చూపు తనం లేని ఆలోచనతో సమస్యను పెంచి పోషించి ఇపుడు న్యాయం కావాలి అంటూ ఢిల్లీ గడ్ద మీద నిరసనలు చేస్తూ ఏపీ బ్రాండ్ వాల్యూ ను తగ్గించడం అన్యాయమే అవుతుంది.

గల్లీ గొడవలు, కుటుంబ గొడవలు ఢిల్లీలో చర్చించడం ఏమిటి? దీనితో ఏపీలో రాజకీయ పరిస్థితుల పై పారిశ్రామిక వేత్తలకు నమ్మకం ఏర్పడుతుందా? పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారా? రాష్ట్ర రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే దేశ రాజధానిలో నిరసనలు తెలియ చేయడం జగన్ కుటిల నీతికి అద్దం పడుతుంది.

Also Read – ఒక్క హిట్ ప్లీజ్…


అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కోర్టుకు వెళుతున్నారు. రాష్ట్రంలోకి రావాలంటే రాష్ట్రపతి పాలన కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్ల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరిగే జగన్ తన కేసుల పరిష్కారానికి మాత్రం కోర్ట్ హాజరు కారు. పక్క పార్టీల మీద ఆరోపణలు చేసే జగన్ తన పార్టీలో ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతల పై చర్యలు తీసుకోలేరు. ఇదేమి జగన్నాటకమో?