ముఖ్యమంత్రి పీఠం కోసమై జగన్ 3000 కిలోమీటర్ల మజిలి

YS Jagan Targets Chief minister positionగతేడాది నవంబర్‌ 6న వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర 11 జిల్లాల మీదుగా సాగి కాసేపటి క్రితం ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో 3వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సుదీర్ఘ పాదయాత్రతో ఈసారి ఎన్నికలలో అధికారంలోకి రావడం పక్కా అని ప్రతిపక్ష పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

[m9sd]

ADVERTISEMENT

వెళ్ళిన ప్రతి చోటా అపూర్వ స్పందన రావడంతో పార్టీలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఇంకో నెలన్నర – రెండు నెలల పాటు జగన్ పాదయాత్ర సాగబోతోంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను చుట్టి వస్తే మొత్తం రాష్ట్రమంతా పాదయాత్ర పూర్తి చూసినట్టే. 3500 కిలోమీటర్ల పైగా సాగబోతున్న ఈ పాదయాత్ర తెలుగు రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద పాదయాత్ర.

కాకపోతే గతంలో పాదయాత్ర చేసిన వైఎస్సాఆర్, చంద్రబాబు అసలు బ్రేక్ లేకుండా నడిస్తే, జగన్ మాత్రం కోర్టు కేసుల వల్ల ప్రతీ శుక్రవారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వెళ్తున్నారు. పాదయాత్ర పూర్తి అయిన వెంటనే అన్ని నియోజకవర్గాలలోను అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉంటారు జగన్. ఆ తరువాత పాదయాత్రలో కవర్ కానీ చోట్లకు బస్సు యాత్ర ఉండొచ్చని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories