ఈ మూడు ముక్కలాట ఇంకా ఎన్నాళ్ళు?

YS Jagan-ThreeCapitals-andhra-pradeshఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కోసం రాజధాని గ్రామాల రైతులు తమ జీవనోపాధి అయిన వ్యవసాయ భూములను ఇచ్చేశారు. కానీ జగన్ ప్రభుత్వం రాజధాని పనులను నిలిపివేయడంతో గత రెండున్నరేళ్ళుగా ‘బిల్డ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్‌’ పేరుతో నిరవదికంగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు.

‘నేను విన్నాను… ఉన్నానని’ గొప్పగా చెప్పుకొనే సిఎం జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లికి కూతవేటు దూరంలో వారు చేస్తున్న ఆందోళనలు కనబడలేదు. వాటి గురించి తెలిసినా అటువైపు తొంగి చూడలేదు. వాళ్ళందరూ టిడిపి మనుషులని ముద్రవేసి తప్పించుకొన్నారు. కానీ వారు ఇచ్చిన భూములనే అమ్ముకొని ఆ సొమ్మును వాడుకొంటున్నప్పుడు, అది టిడిపి వాళ్ళ సొమ్ము అని భావించకపోవడం విశేషం. అక్కడ రాజధాని నిర్మిస్తే టిడిపికి, కమ్మ కులస్తులకి లాభం చేకూరుతుందనే వంకతో జగన్ ప్రభుత్వం మూడేళ్ళ క్రితం మొదలుపెట్టిన మూడు ముక్కలాటను కూడా పూర్తిచేయలేకపోయింది.

ADVERTISEMENT

జగన్ ప్రభుత్వం ఈ మూడు ముక్కలాటతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రాజధానిలేని రాష్ట్రంగా మిగిల్చేసిందని భూములు ఇచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ధగధగాయమానంగా వెలిగిపోవలసిన అమరావతిని ఈ మూడు ముక్కలాటతో జగన్ పాడుపెట్టేశారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చుకొంటూ పోతే ఎన్నటికీ రాష్ట్రానికి రాజధాని ఉండబోదని అన్నారు.

అటు జీవనాధారమైన వ్యవసాయ భూములు కోల్పోయి, ఇటు రాజధాని నిర్మించకపోవడంతో తమ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాటతో తమ జీవితాలు చితికి పోయాయని అన్నారు.

పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, తమవి, తల్లితండ్రుల వైద్య ఖర్చులకు నిత్యం పరుల ముందు చేయి చాచవలసివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎన్ని కష్టాలు వస్తున్నప్పటికీ అమరావతిని నిర్మించేవరకు తమ ఉద్యమం నిలిపేది లేదని స్పష్టం చేశారు. తమకు ఈ దుస్థితి కల్పించిన సిఎం జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు కానీ వచ్చే ఎన్నికలలో తప్పకుండా తగినవిదంగా బుద్ది చెపుతామని రాజధాని రైతులు హెచ్చరించారు.

ADVERTISEMENT
Latest Stories