jagan-meets-ramoji-rao-

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని జగన్మోహన్‌ రెడ్డి అన్ని రంగాలలో భ్రష్టు పట్టించేస్తూ, నీచ రాజకీయాలలో ప్రజలను, ప్రతిపక్షాలను హింసిస్తుంటే, రామోజీరావు నాకెందుకని హాయిగా తన వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ రాష్ట్రంపై మమకారంతో ఆయన ధైర్యంగా తన ఈనాడూ మీడియా సంస్థల ద్వారా జగన్‌ పాలనలో లోపాలను, అవినీతిని ఎత్తి చూపుతూ నిలదీశారు. జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని, ప్రజలు పడుతున్న కష్టాలను చూపిస్తూ జగన్‌తో ఓ ప్రతిపక్షపార్టీలాగే అలుపెరుగని పోరాటాలు చేశారు.

Also Read – విశాఖకు మెట్రో… భారం అవుతుందేమో?

అందుకు కక్ష కట్టిన జగన్‌, ఆయన విశ్వసనీయతను, ఆర్ధిక మూలాలు, దాంతో పాటు ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బ తీసేందుకు మార్గదర్శిపై సీఐడీ పోలీసుల చేత దాడులు చేయించారు. కేసులు నమోదు చేయించారు. తమ సాక్షి పత్రికలో రామోజీరావుని అవహేళన చేస్తూ వ్యంగ్యంగా అనేక కధనాలు, కార్టూన్లు ప్రచురింపజేశారు. వాటికి అంతే ఉండేది కాదు.

జగన్‌ స్వయంగా ప్రతీ సభలోను చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లతో పాటు రామోజీ రావు, వేమూరి రాధాకృష్ణలను కూడా దూషిస్తూ వాళ్ళందరూ తోడేళ్ళ గుంపు అని, వారిది ఎల్లో మీడియా అని విమర్శిస్తుండేవారు.

Also Read – రాజకీయ షల్టర్ కావలెను..!

ఇంతగా ఆయనను ద్వేషిస్తూ, అవమానించి, అవహేళన చేసిన జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు ఆయన చనిపోయినందుకు సంతాపం తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. కానీ ఆయన మనసులో పైశాచిక ఆనందం అనుభవిస్తూ పైకి సంతాపం తెలుపుతున్నారని అందరికీ తెలుసు.

రామోజీ రావుకు నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాటలు చాలా ఆలోచింపజేస్తాయి.

Also Read – ఇలా కొట్టేవారెవరైనా ఉన్నారా..మళ్ళీ ఆయనే ట్రై చెయ్యాలా..?

“తెలుగు పత్రిక, సినీ, రాజకీయ, వ్యాపార రంగాలలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆ మహానుభావుడు రామోజీ రావు, చివరి రోజులలో ఈ దరిద్రపు చెత్త రాజకీయ నాయకుల మాటలతో చాలా మానసిక క్షోభ అనుభవించారు. కానీ వారికి ఆ భగవంతుడే శిక్ష విధించాడు. ఆయన ఈ (టిడిపి కూటమి) విజయాన్ని కళ్ళారా చూసుకొని చాలా తృప్తిగా తనువు చాలించారు. అందుకు ఆయనకు మనశాంతి లభించే ఉంటుంది,” అని అన్నారు.

రామోజీ రావు చేపట్టిన అనేక వ్యాపారాలు, నిర్మించిన అనేక సినిమాలు, నిర్వహించిన అనేక తెలుగు న్యూస్ ఛానల్స్, రామోజీ ఫిలిమ్ సిటీ వంటివి తెలుగు ప్రజలందరికీ గర్వకారణమే. వాటితో ఆయన లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఎక్కడో మారుమూల గ్రామంలో రామోజీరావు పేరు కూడా తెలీని ఓ న్యూస్ పేపర్ బాయ్ ఇంటింటికీ ఈనాడు పేపర్ వేయడం ద్వారా ఉపాధి పొందుతుందటమే ఇందుకు చిన్న ఉదాహరణ.

రామోజీ రావు ప్రత్యక్షంగా రాజకీయాలలోకి రానప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను శాశించారని కేసీఆర్‌, జగన్‌ ఏడుపులే చెపుతున్నాయి.

కానీ తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసే వారెవరైనా నా శత్రువులే అన్నట్లు వ్యవహరించే జగన్మోహన్‌ రెడ్డి అవమానించని వారు లేరు. అవహేళన చేయానివారు అసలే లేరు. వారిలో రామోజీ రావు కూడా ఒకరు.

ప్రముఖులను జగన్‌ అవమానిస్తే వారు మనసులో బాధపడి ఉండవచ్చు. కానీ దాని వలన వారికి కలిగిన నష్టం ఏమీ లేదు కానీ వారితో అలా ప్రవర్తించిన ప్రతీసారి ప్రజల దృష్టిలో జగన్‌ స్థాయి పడిపోతూనే ఉంది.

చివరికి ఎన్నికలలో అందరి చేత తిరస్కరించబడి జగన్మోహన్‌ రెడ్డి అధః పాతాళానికి పడిపోగా, కానరాని అనంత లోకాలకు వెళ్ళిపోయిన రామోజీ రావు మాత్రం తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ శాస్వితంగా నిలిచిపోతారు. ప్రజలు శ్రీరాముడిని గుర్తుంచుకున్నారు. రావణుడిని కూడా మరిచిపోరు!