రామోజీ రావు…జగన్ ను ఇంతలా భయపెట్టారా.?

YS Jagan

గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే కాలం చేసారు ఈటీవీ అథినేత రామోజీ రావు. అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలన మీద జగన్ తో ప్రజా యుద్ధమే చేసారు రామోజీ. అయితే నాలుగు పదుల వయసున్న వైస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఏడు పదుల వయసు మీదపడ్డ ఒక యువ వృద్ధ పత్రికాధిపతితో రాజకీయ రణం సాగించారు.

అయితే వయసు, పదవి కన్నా అనుభవం, నమ్ముకున్న సిద్ధాంతం బలమైనది నిరూపించారు రామోజీ రావు. ఈ నేపథ్యంలో తానూ పోరాడిన రాజకీయ యుద్ధంలో గెలిచి ఓడారు రామోజీ రావు. జగన్ ను గద్దె దింపడంలో, వైసీపీ ని ఇంటికి పంపడంలో తనదైన పాత్ర పోషించిన రామోజీ యుద్ధంలో విజయం సాధించి వీర మరణం చెందారు.

ADVERTISEMENT

అయితే రామోజీ రావు చనిపోయి 8 నెలలు పూర్తయినా జగన్ ఇంకా ఆయన జపమే చేస్తున్నారు, అలాగే తన రాజకీయ విమర్శలలో రామోజీ రావు నామస్మరణే తలుస్తున్నారు జగన్. వల్లభనేని అరెస్టు నేపథ్యంలో ఆయన పరామర్శకు వెళ్లిన జగన్ ఆ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ బాబుని ముఖ్యమంత్రిగా చేయడానికి రామోజీరావు నిత్యం శ్రమిస్తారు అంటూ వ్యాఖ్యానించారు.

టీడీపీ కోసం, బాబు కోసం పని చేయడానికి ABN రాధా కృష్ణ, టీవీ 5 బిఆర్ నాయుడు, ఈటీవీ రామోజీరావు వంటి మీడియా మాఫియా అండగా ఉంటుంది. ఈ మాఫియా బాబుకి వ్యతిరేకంగా ఏ రాజకీయ నాయకుడిని, పార్టీని ఎదగనివ్వదు అంటూ మీడియా ముందు ఆవేశపడిన జగన్, రామోజీ చనిపోయారన్న విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారా.? అనిపిస్తుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తరువాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయక ముందే పరమపదించారు. అయినా కూడా జగన్ వైసీపీ ఓటమితో కొన్ని విషయాలను ఒప్పుకోలేకపోతున్నారా అన్నట్టుగా రామోజీ విషయంలో కూడా జగన్ వాస్తవాన్ని ఒప్పుకోలేకపోతున్నారా.? లేక ఇంకా రామోజీ రావు బతికి ఉన్నట్టే భ్రమ పడుతున్నారా.? అంటే రామోజీ రావు చనిపోయి కూడా జగన్ ను ఇంతలా వెంటాడుతున్నారా.?

ADVERTISEMENT
Latest Stories