ప్రతీ అడుగు తప్పటడుగేనా… జగన్?

YS Jagan

పదవీ, అధికారం కోల్పోయిన తర్వాత పరివర్తన రావాలి. రాకపోయినా పర్వాలేదు. ఆత్మపరిశీలన చేసుకొని సరైన దారిలో పయనించాలి. అదే…పార్టీ అధినేత అయితే మరింత బాధ్యతగా మెలగాలి. ఆచితూచి అడుగులు వేస్తూ, అవసరమైనప్పుడు దూకుడుగా పార్టీని ముందుండి నడిపించాలి.

చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ళు ఇలాగే చేశారు. సరైన వ్యూహాలతో ముందుకు సాగుతూ 175 సీట్లు గెలుస్తామనే భ్రమలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డిని 11 సీట్లకే కట్టడి చేసి ప్యాలస్‌లో కూర్చోపెట్టారు.

ADVERTISEMENT

జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరైన దిశలో సాగక ప్రజల చేత ఛీ కొట్టించుకొని దిగిపోయారు. కనుక ప్రతిపక్షంలోకి మారిన తర్వాత అయినా సరైన దిశలో సాగుతున్నారా? అంటే కాదనే చెప్పవచ్చు.

ఓడిపోగానే మొట్ట మొదట తన ఓటమికి కారణాలు, కారకులను విశ్లేషించుకుని తెలుసుకోవాలి. ఆ తంతుని ఈవీఎంలని నిందిస్తూ మమ అనిపించేశారు.

శాసనసభ సమావేశాలకు హాజరయ్యారా అంటే లేదు. ఢిల్లీలో ధర్నా చేశారు. అదైనా నిజాయితీగా చేశారా? అంటే లేదు… కాంగ్రెస్‌, బీజేపీల బేరసారాలకు దానిని ఉపయోగించుకున్నారు. పోనీ ఆ ప్రయత్నమైనా ఫలించిందా అంటే లేదు!

శాసనసభకు రాకపోతే పాయే… శాసనసభకు రాదలచుకోనప్పుడు, సంఖ్య బలం లేనప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అడగడమే తప్పు. అంతటితో ఆగకుండా దాని కోసం హైకోర్టుకి వెళ్ళడం మరో పొరపాటు.

తాను ముఖ్యమంత్రిని కాదని జగన్‌ ఇంకా అంగీకరించలేకపోతున్నారు. అందుకే పూర్వంలాగే ముఖ్యమంత్రికి కల్పించే జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకో బుల్లెట్ ప్రూఫ్ వాహనం, అవసరమైతే ఓ జామార్ వాహనం ఇమ్మనమని చెప్పిందే తప్ప జగన్‌ కోరిన్నట్లు 139 మందితో భద్రత కల్పించాలని చెప్పలేదు. నియమ నిబంధనల ప్రకారం ఆయనకు రక్షణ కల్పించాలని మాత్రమే చెప్పింది.

కనుక జగన్‌ హైకోర్టుకి వెళ్ళి ఏం సాధించారంటే ఏమీ లేదనే చెప్పొచ్చు. ఎన్నికలలో దారుణ పరాజయం పొందిన తర్వాత కూడా జగన్‌ ఇంత అనాలోచితంగా, ఇంత అగమ్యగోచరంగా వ్యవహరిస్తుంటే, ఇక ఆ పార్టీ ఎంత కాలం మనుగడ సాగించగలదు?

జగన్‌ సిఎంగా ఉన్న 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తూనే గడిపేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నామస్మరణతోనే కాలక్షేపం చేస్తున్నారు తప్ప పార్టీని సరైన దిశలో నడిపించలేకపోతున్నారని అనిపిస్తుంది. బయట నుంచి చూసేవారికే ఇలా అనిపిస్తుంటే వైసీపిలో ఉన్నవారికి ఏమనిపిస్తుందో తేలికగానే ఊహించుకోవచ్చు.

కనుక వైసీపిలో నాయకత్వ మార్పు అవసరమనిపిస్తోంది. అయితే ఆ మార్పు ఎప్పుడు, ఏవిదంగా జరుగుతుందో బహుశః అందరికీ తెలిసే ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories