YS-Jagan-YS-Sharmilaనేడు పవిత్రమైన రాఖీ పండగ. అన్నదమ్ములు… అక్కా చెల్లెళ్ళ మద్య అనుబంధాన్ని సూచించే పండగ. ఆడపిల్లలు ఓ సోదరుడి ఆత్మీయత, రక్షణ ఆశిస్తూ ఎంతో ప్రేమతో నేడు రాఖీలు కడుతుంటారు. అన్నా… చెల్లి అనగానే మొట్ట మొదట అందరికీ గుర్తు వచ్చేది ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి వైఎస్ షర్మిలలే. కానీ జగనన్న సంధించిన ఆ బాణం తిరిగి రాలేదు. ఇక రాకపోవచ్చు కూడా. వారి మద్య ఎటువంటి విభేధాలు లేవని విజయమ్మ సర్ది చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఆమెను కూడా కరతాళధ్వనుల మద్య వైసీపీలో నుంచి బయటకు పంపేశారు కనుక ఈరోజు రాఖీ పండగ అని అన్నా చెల్లెళ్ళకు  గుర్తు చేయలేకపోయారు.

ఇక్కడ జగనన్న కూడా బటన్ నొక్కుతూ, “మన అక్కలు… చెల్లెమ్మలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకొంటున్నాను,” అంటూ రాఖీ కట్టకపోయినా అమ్మఒడి, విద్యాదీవెన అంటూ లక్షల కోట్లు చేతిలో పెడుతూనే ఉన్నారు. ఈరోజే జగనన్న మరోసారి బటన్ నొక్కి విద్యా దీవెన అంటూ రూ.694 కోట్లు పంచిపెట్టేశారు. ఈ సందర్భంగా బాపట్లలో విద్యార్ధినుల నెత్తిన చెయ్యి పెట్టి జగనన్న ఆశీర్వదించారు.

Also Read – హింసలోనే క్రెజ్ వెతుకుతున్న ప్రేక్షకులు, దర్శకులు…!

తన అన్న ఇంత ఉదార హృదయుడని గ్రహించలేకనో, అపార్ధం చేసుకొన్నారో తెలీదు కానీ ఇదివరకు ఏటా రాఖీ పండుగనాడు ‘జగనన్న’కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకొనే వైఎస్ షర్మిల, గురి తప్పిన బాణంలా ఎక్కడో వికారాబాద్‌లో పాదయాత్ర చేసుకొంటున్నారు. అక్కడే తెలంగాణ ప్రజలలో కొత్త సోదరులను వెతుక్కొంటూ ముందుకు సాగిపోతున్నారు పాపం!




image.png

Also Read – మా పాలిట ‘వరం’ సామి..!