నాన్నకు లోకంలో నాకంటే ఇష్టమైన వాళ్ళెవరూ లేరు… అంటే ఏంటి చెప్మా!

YS-Shamilaజగనన్నకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ అక్కలు, చెల్లెమ్మలు, అవ్వలు, బామ్మలే కానీ ఆ జాబితాలో సొంత తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిల లేరు!

అన్నతో విభేదించి వైఎస్ షర్మిల తెలంగాణకు వెళ్ళిపోయి అక్కడ ఆమె కూడా తండ్రి పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీని పెట్టుకొని ఆయన పేరు చెప్పుకొంటూ దానిని బలోపేతం చేసుకొనేందుకు కాళ్ళరిగిపోయేలా పాదయాత్ర చేస్తున్నారు. ఒంటరి పోరాటం చేస్తున్న ఆమెకు తోడు అవసరమంటూ విజయమ్మ కూడా వైసీపీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి చాలా కాలమే అయ్యింది.

ADVERTISEMENT

ఇన్నేళ్ళ తర్వాత వైఎస్ షర్మిల నిన్న తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒకటొకటిగా ఎవరికీ తెలియని విషయాలు చెపుతున్నారు. ఇటీవల ఆమె “నా తండ్రి ప్రమాదంలో చనిపోలేదు. కొందరు కుట్ర చేసి చంపేశారు,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిపై సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరూ స్పందించలేదు!

తాజాగా వైఎస్ షర్మిల తన తండ్రి గురించి మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా మోమిన్ పేట మండలంలోని మోరంగపల్లి వద్ద మీడియాతో మాట్లాడుతూ, “ఈ లోకంలో నాకంటే నాన్నకు ఇష్టమైన వాళ్ళు ఎవరూ లేరు. అలాగే ఈ లోకంలో నాకంటే నాన్నాను ప్రేమించేవాళ్ళు ఎవరూ లేరు,” అని అన్నారు.

తండ్రీ కూతుర్ల మద్య అటువంటి అనుబందం ఉండటం సహజమే. కానీ ఈవిషయం ఆమె చెప్పిన సమయం, సందర్భం కారణంగా దాని పరమార్దం ఏమిటని ఆలోచించవలసివస్తోంది.

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ తన అన్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నప్పుడు ఆమె ఈ మాటలు అన్నారు. అంటే తండ్రిపై ప్రేమతో అన్న ఈ నిర్ణయం తీసుకోలేదని, అన్నకు తండ్రిపై ప్రేమ లేదని, అలాగే తన తండ్రికి కూడా అన్న అంటే ప్రేమ లేదని ఆమె చెపుతున్నట్లుంది.

ఇది వైఎస్ కుటుంబంలోని ఆంతరంగిక సమస్య. వారి మద్య బందాలు, అనుబందాలు ఎలా ఉన్నాయో బయటి వ్యక్తులు ఎవరూ చెప్పలేరు. కానీ తన అన్న జగన్మోహన్ రెడ్డికి కుటుంబంలో ఎవరితో బలమైన అనుబందం లేదని లేదా వారికి ఆయనతో అనుబందం లేదని వైఎస్ షర్మిల మాటలను బట్టి అర్దం అవుతోంది. సొంత కుటుంబాన్ని ప్రేమించలేనప్పుడు, వారు జగన్మోహన్ రెడ్డిని అభిమానించనప్పుడు, ఆయన రాష్ట్రంలో ప్రజలను సొంత కుటుంబ సభ్యుల ప్రేమిస్తున్నానంటే నమ్మశక్యంగా ఉందా?

ADVERTISEMENT
Latest Stories