వైఎస్సార్‌ బయోపిక్‌… జగన్ చేతిలో అస్త్రమా?

YS Rajashekar Reddy Biopicదివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా ఓ బయోపిక్‌ రాబోతోంది. ఇందులో రాజశేఖర్‌ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. దీనిని ఆయన తనయుడు జగనే తన పార్టీలోని కొందరి ద్వారా నిర్మిస్తున్నారని సమాచారం.

ADVERTISEMENT

గతంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌, నటుడు రాజశేఖర్‌తో కలిసి వైఎస్సార్‌ బయోపిక్‌ తీయాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పుడు ‘ఆనందో బ్రహ్మ’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి. రాఘవ్‌ వైఎస్సార్‌ బయోపిక్‌ తెరకెక్కించనున్నారు.

వైఎస్సార్‌ పై ఉన్న సెంటిమెంట్ తోనే జగన్ రాజకీయ మనుగడ సాగుతుంది. అయితే పార్టీ పెట్టిన కొత్తలో ఉన్నంత సెంటిమెంట్ ఇప్పుడు లేదనే చెప్పుకోవాలి. దీనితో దానిని పెంచే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేస్తున్నారు జగన్. 2019 సాధారణ ఎన్నికల ముందు సినిమా విడుదల అయ్యేలా ఏర్పాట్లు చేస్తునట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories