
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’ తేనీటి విందు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు, పద్మ పురస్కార గ్రహీతలను ఆహ్వానించగా అందరూ హాజరయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సిఎస్ నీరబ్ కుమార్, డిజిపి ద్వారకా తిరుమల రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?
టిడిపి, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు, యంపీ, ఎమ్మెల్యేలు అలాగే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు కూడా హాజరయ్యారు. అందరూ ఆప్యాయంగా పరస్పరం పలకరించుకొని మాట్లాడుకున్నారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సీపీఐ కె.రామకృష్ణ, వైఎస్ షర్మిలని ఆప్యాయంగా పలకరించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా అందరి వద్దకు వెళ్ళి పలకరించారు. సుమారు గంటసేపు ఈ కార్యక్రమం చాలా ఆహ్లాదకర వాతావరణంలో సాగింది.
Also Read – ఇక్కడ బిఆర్ఎస్.. అక్కడ టీడీపీ: కల్వకుంట్ల కవిత
రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ విందుకు కనీసం ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్ కూడా లేని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. కానీ ఆమె సోదరుడు, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపి ఎమ్మెల్యేలు మాత్రం ఈ విందుకు హాజరుకాలేదు.
ఇదేమీ టిడిపి లేదా చంద్రబాబు నాయుడు ఇస్తున్న విందుకాదు జగన్ వద్దనుకోవడానికి. రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన విందు. గవర్నర్ ఆహ్వానాన్ని మన్నించి ఎట్ హోమ్ విందుకి జగన్ హాజరయితే ఆయనకే గౌరవంగా ఉండేది. ఇప్పుడు గవర్నర్ ఆహ్వానాన్ని తిరస్కరించిన జగన్ రేపు ఏదో సమస్యపై వినతిపత్రం ఇచ్చేందుకు ఆయన వద్దకే వెళ్ళాల్సి ఉంటుందనే సంగతి మరిచిన్నట్లున్నారు.
Also Read – వైసీపీ నేతల కేసులు.. ఎక్స్‌ఎల్ షీట్ పెట్టాలేమో?
తెలంగాణలో కేసీఆర్ కూడా ఇదేవిదంగా వ్యవహరించేవారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలని గౌరవించని కారణంగానే ఇప్పుడు కేసీఆర్, జగన్ ఇద్దరి పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉందనుకోవాలేమో?