ఢిల్లీకి చెల్లి… కాంగ్రెస్‌లో చేరేందుకే… కానీ ఎక్కడ?

YS Sharmilaవైఎస్ షర్మిల నేడు మరోసారి బెంగళూరు బయలుదేరి వెళ్ళి ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మంత్రి డికే శివకుమార్‌తో భేటీ అయిన్నట్లు తాజా సమాచారం. ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దంగానే ఉన్నారు. అందుకే పాదయాత్రలు చేయడం కూడా మానుకొన్నారు.

కానీ ఆమెను ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్‌ అధిష్టానం ఒత్తిడి చేస్తుంటే, ఏపీకి వెళితే అన్న జగన్‌తో రాజకీయ యుద్ధం చేయవలసి ఉంటుంది. అది ఆమెకు, జగన్‌కు, వారి తల్లి విజయమ్మకు, ఇరువురి పార్టీలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్‌ అమరావతికి కట్టుబడి ఉంది కనుక దాని గురించి అభివృద్ధిలో ఏపీ వెనకబాటుతనం వంటి అంశాల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అన్న జగన్‌ మీద వ్యక్తిగత విమర్శలు చేయక తప్పదు. అప్పుడు వైఎస్ కుటుంబం పరువు బజారున పడుతుంది. కనుక తాను తెలంగాణ కాంగ్రెస్‌లోనే పనిచేస్తానని వైఎస్ షర్మిల పట్టుబడుతున్నారు.

ADVERTISEMENT

అయితే ఆమెకు అక్కడ తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు లేదని, ఏపీ కాంగ్రెస్‌లో చేరితే ఆమెకు అన్ని విధాలా సహకరిస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పడంతో వైఎస్ షర్మిల అయోమయంలో పడ్డారు.

ఇప్పటికే ఈ విలీనం వార్తలు మీడియాలో వచ్చేయడంతో ఆమె సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఇప్పుడు ఆమె వెంటనడిచేందుకు ఇష్టపడటం లేదు. ఆమె కూడా తన అన్న జగన్మోహన్ రెడ్డిలాగే తమని నడిరోడ్డుపై వదిలేసి ఏపీకి వెళ్లిపోతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక వైఎస్ షర్మిల తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

ఈ నేపధ్యంలో ఆమె బెంగళూరు వెళ్ళి మళ్ళీ డికే శివకుమార్‌తో భేటీ అయిన తర్వాత, ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ అధిష్టానంతో భేటీ అవుతారని తెలుస్తోంది. కనుక ఆమె ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌లో దేనిలో చేరుతారనేది త్వరలోనే తెలియవచ్చు.

ఒకవేళ ఏపీ కాంగ్రెస్‌లో చేరినట్లయితే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో మరింత రసవత్తరంగా మారడం ఖాయం. ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్‌లో చేరితే ఇప్పటికే దానిలో నేతలు కుమ్ములాడుకొంటున్నారు. వారితో పాటు ఆమె కూడా జాయిన్ కావలసి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories