
ఆలస్యంగా బయటపడిన గుడ్లవల్లేరు ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపిస్తోంది. ఇప్పటికే జిల్లా మంత్రి, కలెక్టర్, ఎస్పీ తదితరులు అక్కడికి వెళ్ళారు. వారి ప్రాధమిక నివేదిక ఆధారంగా ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారితో లోతుగా విచారణ జరిపించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు సిద్దంగా ఉన్నారు.
అయితే ఈ అంశంపై వైసీపి, వైఎస్ షర్మిల స్పందించిన తీరు చూసినప్పుడు చెల్లిని చూసి అన్న నేర్చుకొని ఉంటే బాగుండుననిపిస్తుంది.
Also Read – గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..
“చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల పాలనలో అమ్మాయిల మానప్రాణాలకి రక్షణ కరువు. ఎక్కడ చూసినా ఆడబిడ్డల ఆక్రందనలే… ఇద్దరూ కలిసి విద్యావ్యవస్థని నాశనం చేశారు. పరిశుభ్రమైన ఆహారం లేదు. అమ్మాయిలకు భద్రత లేదు,” అంటూ సోషల్ మీడియాలో వైసీపి ఓ పోస్ట్ పెట్టి చవుకబారు రాజకీయాలకు మళ్ళీ సిద్దమైంది.
జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ అంశంపై స్పందించారు. కానీ ఆమె ఈ సమస్య గురించి ప్రస్తావించి, కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణం విచారణ కమిటీ వేసి బాధ్యులపై కటిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
Also Read – మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా?
వైసీపి జగన్ ధోరణితోనే పనిచేయాలి…. చేస్తుంది కూడా కనుక దీనిపై రాజకీయం చేస్తూ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై బురద జల్లుతోంది. కానీ వైఎస్ షర్మిల ఓ మహిళగా, ఆడపిల్ల తల్లిగా భయాందోళనలు వ్యక్తం చేస్తూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తక్షణం ఉన్నతాధికారులతో కమిటీ వేసి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ చాలా హుందాగా స్పందించారు.
ఎక్కడ రాజకీయాలో ఎక్కడ చేయకూడదో వైఎస్ షర్మిలని చూసి జగన్, వైసీపి నేతలు నేర్చుకోవలసిన అవసరం ఉంది.
Also Read – జగన్‌తో సహవాసం.. ముగింపు ఇలాగే!
ఆడపిల్లల బాత్ రూముల్లో హెడెన్ కెమెరాలు..
3వందలకు పైగా వీడియోలు..విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు.గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలి. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చదవు,సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు..…
— YS Sharmila (@realyssharmila) August 30, 2024