జ‌గ‌న్ కు బాబాయ్ క‌న్నా కాంపౌండ‌ర్ ఎక్కువ‌య్యాడా..?

ys sunitha about conversation with ys jagan on viveka murder caseఏపీలో ఇప్ప‌టికీ సంచ‌ల‌న మిస్ట‌రీగా వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ఉంది. ఆయ‌న హ‌త్య‌పై ఎన్నో అనుమానాలు ఇప్ప‌టికీ తెర‌మీద‌కు వ‌స్తూనే ఉన్నాయి. అయితే వివేకా కూతురు డాక్ట‌ర్ సునీత చేస్తున్న ఆరోప‌ణ‌లు రోజు రోజుకూ సంచ‌ల‌నం రేపుతున్నాయి. తాజాగా ఆమె సీబీఐ ముందు వెల్ల‌డించిన వివ‌రాలు సంచ‌ల‌నం రేపుతున్నాయి.

వివేకా హ‌త్య కేసులో కీల‌క ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి మీద, ఉద‌య్ కుమార్‌రెడ్డి, శంక‌ర్ రెడ్డి లాంటి వారి మీద అనుమానంతో జ‌గ‌న్‌ను సీబీఐ ఎంక్వ‌యిరీ వేయ‌మ‌ని అడిగితే త‌న మీద కోప్ప‌డ్డార‌ని ఆమె చెప్పారు. ఉద‌య్ కుమార్ పేరు ఎందుకు చేర్చావ‌ని న‌న్ను అడిగార‌ని ఆమె పేర్కొన్నారు. వాస్త‌వానికి ఈ ఉద‌య్ కుమార్ రెడ్డి జ‌గ‌న్ భార్య భార‌తి తండ్రి ఆస్ప‌త్రిలోనే ప‌నిచేస్తుంటారు.

ADVERTISEMENT

అత‌ను కాంపౌండ‌ర్‌. అయితే త‌న తండ్రి క‌న్నా ఒక కాంపౌండ‌ర్‌ జ‌గ‌న్‌కు ఎక్కువ అయిపోయాడంటూ సునీత ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అయితే సీబీఐ విచార‌ణ జ‌ర‌ప‌మని జ‌గ‌న్‌ను కోరితే.. అవినాశ్ మీద అనుమానంతో అడుగుతున్నావ‌ని, అలా చేస్తే అత‌ను వైసీపీని వీడి బీజేపీలో చేరిపోతాడ‌ని, అంత‌కు మించి ఏం కాద‌ని జ‌గ‌న్ అన్నారంట‌.

అంటే బీజేపీలో చేరితో ఎలాంటి సీబీఐ ఎంక్వ‌యిరీలు ప‌నిచేయ‌వ‌ని ఆయ‌న ఇన్ డైరెక్ట్ గా చెప్పాడ‌న్న‌మాట‌. ఇదే విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్నే సునీత చివ‌ర‌కు కోర్టును ఆశ్ర‌యించింది. సీబీఐ ముందు ఆమె ఈ విష‌యాల‌ను వెల్ల‌డించింది. అయితే వీట‌న్నింటినీ చూస్తుంటే.. జ‌గ‌న్ ఒక కాంపౌండ‌ర్‌ను ఎందుకు వెన‌కేసుకు వ‌స్తున్నాడ‌న్నదే ఇక్క‌డ ప్ర‌ధానమైన అనుమానం.

ఎంతైనా జ‌గ‌న్ ఇలా సునీతోనే డైరెక్ట్ గా అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నాడంటే ఇందులో ఇంకేమైనా బ‌లమైన కార‌ణాలు ఉండొచ్చ‌ని అంటున్నారు న్యాయ నిపుణులు. ఇదే విష‌యం మీద లోతైన విచార‌ణ జ‌ర‌పాలంటూ టీడీపీ నేత‌లు ప‌ట్టుబ‌డుతున్నారు. ఎందుకంటే వివేకా హ‌త్య జ‌రిగిన‌ట్టు ఉద‌య్‌కుమార్‌కు అంద‌రికంటే ఎలా ముందు తెలిసింద‌న్న‌దే ఇక్క‌డ ప్ర‌ధాన‌మైన ప్ర‌శ్న‌. మ‌రి సీబీఐ ఏం తేల్చుతుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories