వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించాక, వారు చేసిన ఉపఎన్నికలు రాని రాజీనామాలను ప్రజలకు చెప్పుకోవాలని వంచనపై దీక్ష పేరుతో అక్కడక్కడా సభలు పెడుతున్నారు. ఎప్పటిలానే మొత్తం పాపం అంతా చంద్రబాబు మీదకు నెట్టేసి అనాలి కాబట్టి తప్పక మోడీని నాలుగే నాలుగు మాటలు అంటున్నారు.
ఇందులో కొత్త విషయమేమి లేకపోయినా ఈ సభల్లో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే. ఈ సభలకు జగన్ హాజరు కాకపోవడం. ఆయన ఆయనపాటికి ఆయన వేరే జిల్లాలలో పాదయాత్ర చేసుకుంటున్నారు. పెద్దగా కష్టపడక్కర్లేకుండా ఆయన తెలుగు దేశం ప్రభుత్వాన్ని రుణమాఫీ, నిరుద్యోగ భృతి లాంటి విమర్శలు చేస్తున్నారని తేలికగా చెప్పెయ్యొచ్చు.
ఎంపీలు మోడీని విమర్శిస్తే దానిపై మీడియాలో పెద్దగా స్పందన రాదు. అదే జగన్ అటువంటి సభలకు వెళ్ళి విమర్శలు చేస్తే జాతీయ మీడియా కూడా ఫోకస్ చేస్తుంది. దీనివల్ల కేంద్రం ఆయన అవినీతి కేసులను పరుగులు పెట్టించవచ్చు. దీనితో ఎందుకులే ఈ గోల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అని దూరంగా ఉంటున్నారు.



