
చేతిలో మీడియా, ఒక వార్త పత్రిక ఉంటే చాలు ఇక ప్రత్యర్థి ఎవరైనా తమ నోటికొచ్చింది వాగేద్దాం, చేతికి నచ్చింది రాసేద్దాం అన్నట్టుగా తయారయ్యింది విలువలు లేని, విశ్వసనీయత తెలియని సాక్షి.
రాజకీయాలు మొదలుకుని సినిమా ఇండస్ట్రీ వరకు తమకు నచ్చని వారి పై విషం చిమ్మడం, నీలి రాతలు రాయడం అలవాటుగా మారిపోయిన సాక్షి ఇప్పుడు తన ఫోకస్ మొత్తం లైలా సినిమా మీద హీరో విశ్వక్ సేన్ మీదకు షిఫ్ట్ చేసింది. లైలా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా జరిగిన 11 గొర్రెల రచ్చను ఇంకా కొనసాగిస్తూ తన మీడియాలో డిబేట్లు, కథనాలు ప్రచారం చేసుకుని పైశాచిక ఆనందాన్ని పొందుతుంది సాక్షి.
Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?
“నోటికొచ్చిందల్లా వాగితే పాతాళానికి తొక్కిపడేస్తాం” అనే ప్రోగ్రాంతో వైసీపీ శ్రేణులు ఇచ్చిన బాయ్ కాట్ # లైలా ఫలితంగానే లైలా మూవీ ప్లాప్ అయ్యిందని, అందువల్లే ఆ సినిమాకు కలెక్షన్లు రావడం లేదని, ప్రేక్షకుల నుండి ఆదరణ దక్కడం లేదంటూ విషయం తెలియని విశ్లేషకులను పెట్టుకుని సాక్షిలో తెగ హంగామా చేస్తుంది వైసీపీ.
దీనితో అవును నిజంగానే నోటికి వచ్చిందల్లా వాగబట్టే 151 నుంచి వైసీపీ 11 కి పడింది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఓటమితో వైసీపీ పాతాళంలోకి వెళ్లినా ఇంకా పొగరు తగ్గలేదు అన్నట్టుగానే ఇంకా అవే చిల్లర రాజకీయాలు, దిగజారుడు విమర్శలు చేస్తుంది.
Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?
ఒక చిన్న సినిమా మీద ఇంతటి కక్ష్య సాధింపా.? లైలా సినిమా ప్లాప్ అయ్యింది కాబట్టి సాక్షి ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి మానసిక ఆనందం పొందుతుంది. అదే ఆ మూవీ హిట్ అయితే వైసీపీ స్లొగన్స్ ఏ బురద గుంటలో కొట్టుకుపోయాయో, సినిమా విజయాన్ని ఆపలేకపోయిన వైసీపీ నినాదాలు అంటూ డిబేట్లు పెట్టగలదా.?
అయితే లైలా సినిమా కథ, కథనం పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం వల్లనే థియేటర్లలో సైలెంట్ అయ్యింది. అంతే కానీ వైసీపీ ఇచ్చిన పిలుపుకో, లేక సాక్షి వండి వడ్డించిన వ్యతిరేక కథనాలకో కాదు. అలా అయితే బన్నీ పుష్ప మూవీ ని మెగా అభిమానులు ఎంతోమంది వ్యతిరేకించారు. అయినా చివరికి పుష్ప ఫలితం ఏమిటనేది సాక్షాత్తు మెగాస్టార్ చిరు నోటే వినాల్సివచ్చింది.
Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!
అలాగే వైసీపీ మద్దతు తో, జగన్ బయోపిక్ అంటూ వచ్చిన యాత్ర -2 ఎప్పుడు థియేటర్లలోకి వచ్చిందో ఎప్పుడు వెళ్లిపోయిందో వైసీపీ శ్రేణులకు కూడా తెలియదు. కనీసం ఓటిటిలో కూడా యాత్ర- 2 కు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కలేదు. అలాగే వైసీపీ పిలుపు మేరకు, సాక్షి ప్రచారం చేసిన ఆర్జీవీ వ్యూహం, శపధం, లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలను సినీ ప్రేక్షకులు, తెలుగు ప్రజలు ఎందుకు బాయ్ కాట్ చేసారో సాక్షి చెప్పగలదా.?
నిజంగా ఒకరి పిలుపుతోనో, ఒకరి మాటతోనో ఒక సినిమా జయాపజయాలు ఆధారపడి ఉండవు. అలా అయితే టాలీవుడ్ తో పాటుగా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ డం అనుభవిస్తున్న హీరోల సినిమాలకు ప్లాప్ అనే మాటే వినపడకూడదు. RRR తరువాత వచ్చిన చెర్రీ రెండు సినిమాలు డిజాస్టర్స్ గా ఎలా మారాయి. ఇక రాధే శ్యామ్, ఆదిపురుష్ మూవీలతో ప్రభాస్ విమర్శలను ఎదుర్కొనేవాడా.?
వైసీపీ బాయ్ కాట్ ప్రభావమో, వైసీపీ ప్రమోషన్ విధానమే ఒక సినిమా రిజల్ట్ ను ప్రభావం చెయ్యదు, చెయ్యలేదు. కానీ అలా చెప్పుకుంటూ నోటికొచ్చిందల్లా వాగితే పాతాళానికి తొక్కిపడేస్తాం అంటూ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి పట్టిన గతే ఎదో రోజు సాక్షి కి పట్టక మానదు అనే అభిప్రాయాన్ని వెల్ళబుచ్చుతున్నారు సినీ ప్రేమికులు.