
వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తూ వీరు సౌమ్యులు, మంచివాళ్ళు అంటూ ప్రజలను ఓట్లు అడిగారు. అయితే వైసీపీ ఓటమితో ఆ పార్టీలో మంచివాళ్లంతా ఇప్పుడు అందగాళ్లుగా మారితే, సౌమ్యులంతా అక్రమదారుల రూపాంతరం చెందారు.
గత ఐదేళ్ల వైసీపీ పాపాలకు, అవినీతికి, అక్రమాలకు నేటి కూటమి ప్రభుత్వం కేసులు, అరెస్టులు, శిక్షల పేరుతో ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగానే వైసీపీ హయాంలో రాజకీయ లక్షణ రేఖ దాటి అడుగు బయటపెట్టిన ప్రతి ఒక్కరిని వెతికి పట్టుకునే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం. ఈ రేఖ అతిక్రమించిన ఎంతోమంది వైసీపీ నేతలు ఇప్పటికే జైలు ఊసలు లెక్కపెడుతున్నారు.
Also Read – జగన్, కేటీఆర్: ఇద్దరి లక్ష్యం ఒక్కటేనా.?
అయితే వారిని పరామర్శించేందుకు, వారి అవినీతికి మద్దతిచ్చేందుకు జైలు యాత్రలు చేసిన వైస్ జగన్ వీరంతా అందగాళ్ళు కావడం వల్లనే బాబు కక్ష్య పూరితంగా అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు అంటూ తన పార్టీ అవినీతికి అందం పేరుతో అందమైన ముసుగు తొడిగారు వైస్ జగన్.
ఈ అందగాళ్ళ లిస్టు లో ముందువరుసలో ఉన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అయితే ఇప్పుడు ఆ పార్టీలోని మరో అవినీతి అందగాడు జైలుపాళ్ళయ్యారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నిన్న బెంగళూర్ లో అరెస్టయిన వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా వేంకటగిరి కోర్ట్ 14 రోజులు రిమాండ్ విధించింది.
Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసులో.. జగన్ కూడా?
దీనితో ఈ వైసీపీ అవినీతి అందగాడిని నెల్లూరు సెంట్రల్ జైలు కు తరలించారు అధికారులు. నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు జరిగాయని, అందులో భాగంగా నిబంధలనకు విరుద్ధంగా పేలుడు పదార్ధాల వినియోగం, అందుకు అభ్యంతరం చెప్పిన గిరిజనుల పై బెదింరింపులకు పాల్పడడం, వంటి ఆరోపణలతో కాకాని గోవర్ధన్ ను A 4 గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసారు.
అయితే గత కొద్దీ నెలల నుంచి పరారీలో ఉన్న ఈ మాజీ మంత్రి, వైసీపీ అందగాడు ఎట్టకేలకు చట్టం కళ్ళకు చిక్కాడు, న్యాయస్థానం ముందు నిందితుడిగా నిలుచున్నాడు, రిమాండ్ ఖైదీగా జైలు ఊచలు లెక్కబెడుతూ జగన్ పరామర్శ కోసం ఎదురుచూస్తున్నారు. మరి జగన్ ఈ అక్రమదారుడిని అందగాడిగా పేర్కొంటారా.? లేక మరేదైనా బిరుదుతో సత్కరిస్తారా.?