సాక్షి గారడీ “కామన్ మ్యాన్ వాయిస్” బట్టబయలు!

Common Man Voice2019 ఎన్నికలకు ముందు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని రాజకీయ ఎత్తుగడలను వేసిన వైసీపీ, వాటన్నింటిని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి రావడంతో సక్సెస్ సాధించింది. అయితే అధికారం చేపట్టి మూడేళ్లు దగ్గర పడుతున్న తరుణంలో నాటి గారడీలన్నీ నేడు పేరడీలుగా మారి సోషల్ మీడియాలో విస్తృతంగా సందడి చేస్తున్నాయి.

గతం అలా పక్కన పెడితే, మళ్ళీ వర్తమానంలో కూడా ఇదే రకమైన గారడీలని ప్రవేశ పెడుతున్నారన్న విషయం సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. తాజాగా ఉద్యోగులు నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ సూపర్ సక్సెస్ కావడంతో, వారికి వ్యతిరేక స్వరాలు వినిపిస్తూ ‘కామన్ మ్యాన్ వాయిస్’ పేరుతో సాక్షి ఓ కధనాన్ని ప్రసారం చేసింది.

ADVERTISEMENT

అయితే ఈ వీడియోలో మాట్లాడిన వారు ‘కామన్ మ్యాన్’లు కాదని, వీరంతా వైసీపీ పార్టీకి చెందిన వారన్న విషయాన్ని ఫోటోలతో సహా సోషల్ మీడియా బయట పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో, ‘సాక్షి’ మీడియా భాగోతం మొత్తం బట్టబయలు అవుతోంది. ఇది పీకే వ్యూహమో లేక సాక్షి సొంత కవిత్వమో గానీ, ప్రజలను మళ్ళీ మోసగించలేరన్న విషయమైతే నెటిజన్లు వ్యక్తపరుస్తున్నారు.

కామన్ మ్యాన్ వాయిస్ లో భాగంగా మొదటగా మాట్లాడిన మహిళా సభ్యురాలు, కంటి మహంతి అనూషా పట్నాయక్ ఆంధ్రప్రదేశ్ శిష్టకరణం సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ అన్న విషయం బహిర్గతమైంది. వైసీపీ కండువా కప్పుకున్న ఫోటోలు, అలాగే విజయసాయిరెడ్డితో దిగిన పిక్స్ కూడా ఈ వీడియోలో స్పష్టంగా ఉన్నాయి.

ఇక ‘కామన్ మ్యాన్ వాయిస్’ పేరుతో వినిపించిన మరో స్వరం స్వయానా అనూషా పట్నాయక్ భర్త. ఈ వీడియోలో వారిద్దరూ తీసుకున్న సెల్ఫీలతో పాటు, వైసీపీ కండువాలు కప్పుకుని విజయసాయిరెడ్డితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇలా ఒకరిద్దరే కాదు, అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు జగన్ మీడియా వేసే జిమ్మిక్కులు ఇలాగే ఉంటాయన్న విషయం సోషల్ మీడియా ద్వారా బట్టబయలు అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories