
మాజీ మంత్రి రోజా పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకురాలు. ఆమె ఓ మంత్రిగా తన సమర్ధత నిరూపించుకోలేకపోయినా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను తిట్టిన తిట్టు తిట్టకుండా వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇప్పుడు కొత్త కష్టాలు మొదలవబోతున్నాయి. నగరి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చాలా మంది ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వర్గం ఆమెను మొదటి నుంచే వ్యతిరేకిస్తోంది. శాసనసభ ఎన్నికలలో వారందరూ కలిసి ఆమెని ఓడించారనేది బహిరంగ రహస్యం.
Also Read – అవమానానికి తగ్గ రాజ్యపూజ్యం దక్కుతుందా.?
అయితే ఓటమితో ఆమె కష్టాలు ముగిసిపోలేదు. అప్పుడే మొదలయ్యాయి. జిల్లాలో, నియోజకవర్గంలో ఆమెని చాలా మంది వ్యతిరేకిస్తుండటంతో, దివంగత మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి జగదీష్‌ని వైసీపీలో చేర్చుకొని నగరి నియోజకవర్గం వైసీపీ బాధ్యతలను అప్పగించాలని జగన్ నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.
అయితే రోజాకి ఈ విషయం తెలియడంతో ఆమె షాక్ అయ్యారు. జగన్ కళ్ళలో ఆనందం చూసేందుకు, ఆమె అందరినీ నోరారా తిట్టిపోస్తూ అనవసరంగా అనేక మంది శత్రువులను తయారుచేసుకున్నారు. సరిగ్గా అదే కారణంగా ఆమె కూటమి పార్టీలలోకి వెళ్ళలేని పరిస్థితి కల్పించుకున్నారు.
Also Read – త్రిభాషా…డీలిమిటేషన్ పై పవన్ స్పందన…
జగన్‌ని నమ్ముకుంటే ఇప్పుడు బయటకు పొమ్మనకుండా పొగ బెట్టబోతున్నారు. ఇప్పటికే నగరి నియోజకవర్గంలో రోజా ఓ ఒంటరి పక్షిలా సంచరిస్తున్నారు. జగన్‌కి నచ్చకపోతే బాలినేని, ఆనం, మేకపాటి వంటివారే పార్టీలో ఉండలేక బయటకు పోక తప్పలేదు. వారితో పోలిస్తే రోజా ఏపాటి?
జగన్ చాలా తెలివిగా ఆమె చేత అందరినీ తిట్టించి ఆమెకు అన్ని పార్టీల తలుపులు మూసుకుపోయేలా చేశారు. అది గ్రహించని రోజా నా అంతటి ఫైర్ బ్రాండ్ లీడర్ లేరనుకొని చెలరేగిపోయారు. ఇప్పుడు జగన్ పొగ బెడితే ఎటు పోవాలో తెలీని పరిస్థితి. కానీ ఆమెకు ఇంకా ఒక దారి మిగిలి ఉంది.
Also Read – రుషికొండ ప్యాలస్‌కు 500 కోట్లు.. పక్కనే ఉన్న బీచ్‌కి జీరో!
అదే.. వైఎస్ షర్మిల పంచన కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం. ఇప్పటికే విజయసాయి రెడ్డి వెళ్ళి ఆమెతో చేతులు కలిపారు. కనుక రోజా కూడా వైసీపీ నుంచి బయటకు వస్తే నేరుగా వైఎస్ షర్మిల వద్దకే వెళ్ళక తప్పదు లేదా రాజకీయ సన్యాసం చేయాలి. ఇంతకు మించి ఆమెకు వేరే దారి లేదు కూడా.
కానీ మంచి నోటి పదునున్న రోజా వంటి వ్యక్తి బయటకు వెళ్ళి శత్రువులతో చేతులు కలిపితే ఎంత ప్రమాదమో జగన్‌కి బాగా తెలుసు. కనుక పార్టీలో రోజా ప్రాధాన్యం తగ్గించి, మూల కూర్చోబెట్టినా ఆమె పార్టీలో నుంచి బయటకుపోకుండా జగన్ ఏవిదంగా అడ్డుకుంటారో? రాబోయే రోజుల్లో తెలుస్తుంది.