ఆస్తి తగాదాలే రాజకీయ విబేధాలవుతున్నాయా.?

Political Family Disputes

రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించిన వైఎస్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబాలు నేడు కుటుంబ తగాదాలతో, రాజకీయ విభేదాలతో రచ్చకెక్కుతున్నాయి.

అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి కుమార్తె షర్మిల మధ్య వివాదాలు ఉప్పు నిప్పు మాదిరి సాగుతున్నాయి. అలాగే ఇటు కేసీఆర్ తనయుడు కేటీఆర్ – కుమార్తె కవిత మధ్య విభేదాలు నివురు కప్పిన నిపు మాదిరి కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT

అయితే వీరి ఈ వివాదాల వెనుక ఆస్తి వాటా పంచాయితీలు కారణం అనేది తల్లి విజయలక్ష్మి ప్రకటనలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. వాటాల వద్ద మొదలైన ఈ తగాదాలు రూపం మార్చుకుని రాజకీయంలోకి వచ్చాయని, దాని ఫలితమే వైస్ జగన్ తల్లి విజయలక్ష్మిని, చెల్లి షర్మిలను వైసీపీ కి ఏపీ రాజకీయాలకు దూరం పెట్టారని గట్టి ప్రచారమే జరిగింది.

అలాగే చెల్లి షర్మిల కాంగ్రెస్ కు దగ్గరవడానికి, సునీతతో కలిసి వైసీపీ పై పోరాటడానికి జగన్ తనకు చేసిన ఆర్థిక నష్టమే కారణమని కూడా టాక్ నడిచింది. ఇలా వైఎస్ కుటుంబంలో అన్న చెల్లెళ్ళ మధ్య మొదలైన ఆస్తి తగాదాలు వైసీపీ – కాంగ్రెస్ అనే రాజకీయ విబేధాలుగా మారిపోయాయి.

అయితే ఇక్కడ షర్మిలకు అండగా తల్లి విజయలక్ష్మి నిలిచారు, అలాగే షర్మిల పిల్లలకు తన కుమారుడు జగన్ అన్యాయం చేసారని, ఎదోకరోజు న్యాయం చేస్తాడని ఆశిస్తున్నా అంటూ తన కుటుంబంలో జరుగుతున్న అంతర్గత ఆస్తి తగాదాలను బహిరంగ లేఖతో బయటపెట్టారు.

ఇక కల్వకుంట్ల కుటుంబ విషయానికొస్తే, ప్రస్తుతానికి ఈ కుటుంబంలో మొదలైన రాజకీయ విభేదాలు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే ఈ అన్న – చెల్లెళ్ళ రాజకీయ విభేదాల వెనుక కూడా తండ్రి రాజకీయ వారసత్వానికి తోడు తండ్రి వారసత్వ ఆస్తి కూడా భాగమే అని ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ సాక్షి గా కొన్ని వాక్యాలు చేసారు.

సంపాధించుకున్నదేదో ఇద్దరు సమానంగా పంచుకుంటే కుటుంబంలో ఇలాంటి విభేదాలు రావు కదా, ఆస్తి లో వాటా కోసం ఇలా ఇంటి ఆడబిడ్డను తిట్టిస్తూ సంతోషపడే వ్యక్తులు రాష్ట్రంలోని మహిళల పట్ల బాధ్యతగా ఉంటారా అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేటీఆర్ – కవిత మధ్య సాగుతున్న విభేదాల పై చర్చ కు దారి తీశాయి.

కేటీఆర్ – కవిత మధ్య కూడా జగన్ షర్మిల మాదిరే ఆస్తి తగాదాలు నడుస్తున్నాయా.? అక్కడ టి. వైసీపీ భీజానికి ఇక్కడ తెలంగాణ ప్రజా జాగృతి పునాదుల వెనుకున్న అంతర్గత కారణాలు ఇవేనా.? నాడు తెలంగాణ లో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు వెనుక, కాంగ్రెస్ తో ఏపీలో చేస్తున్న రాజకీయం ముందు షర్మిల – జగన్ మధ్య ఏర్పడిన ఆస్తి తగాదాలే కారణమా.?

అలాగే నేడు బిఆర్ఎస్ లో కవిత – కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు అంటూ మొదలైన ఈ రాజకీయ విభేదాల వెనుక కూడా కల్వకుంట్ల ఆస్తి తగాదాలే కారణాలా.? ఈ తగాదాలే అన్న చెల్లెళ్ళ మధ్య రాజకీయ విబేధాలుగా మారాయా.?

మరి అక్కడ షర్మిల కోసం తల్లి విజయలక్ష్మి జగన్ తో పోరాడుతుంటే, ఇక్కడ తనయుడి కోసం తండ్రి కేసీఆర్ కుమార్తె చేస్తున్న ఆరోపణల పై మౌనం వహిస్తూ కేటీఆర్ కి పరోక్ష మద్దతు ప్రకటిస్తున్నారు. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య అంతర్గతంగా సాగుతున్న బహిరంగ వివాదాల పై విస్తృత చర్చ నడుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories