
ఏపీలో వైసీపీ, తెలంగాణలో బిఆర్ఎస్ రెండు పార్టీలు.. వాటి అధినేతలు జగన్, కేసీఆర్.. అధికారంలో ఉన్నప్పుడు ఒకేలా విర్రవీగారు.. ఇంచుమించు ఒకే సమయంలో ఒకేలా ఓడిపోయారు కూడా. ఇది యాదృచ్ఛికమే కావచ్చు కనుక పెద్దగా పట్టించుకోనవసరం లేదు.
ఓటమి తర్వాత కూడా రెండు పార్టీల రాజకీయ క్యాలండర్.. దానిలో ఈవెంట్స్ అన్నీ ఇంచు మించు ఒకేలా కొనసాగుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే రెండు పార్టీలు కూడబలుకుని క్యాలండర్ తయారుచేసుకొని పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది.
Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?
ముందుగా చెప్పుకోవలసింది కేసీఆర్ ఫామ్‌హౌస్, జగన్ ప్యాలస్ గృహ నిర్బందాలు, వాటి నుంచి బయటకు వచ్చేందుకు వారు స్వయంగా పెట్టుకున్న ‘సంక్రాంతి తర్వాత’ ముహూర్తాలు కనబడతాయి. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి లోపలకు వెళ్ళి, ఒకేసారి బయటకు రాబోతున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు, సిఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ మాయ మాటలు చెప్పి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చారని ఇక్కడ వైసీపీ, అక్కడ బిఆర్ఎస్ పార్టీలు విమర్శిస్తున్నాయి.
Also Read – జగన్ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?
వారిద్దరూ ఎన్నికల హామీలు అమలుచేయడం లేదని, తాము ప్రవేశపెట్టి అమలుచేసిన అత్యద్భుతమైన సంక్షేమ పధకాలు అమలుచేయడం లేదని, ఇద్దరూ రైతులను మోసం చేస్తున్నారని రెండు పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.
తమ పాలనలో అద్భుతంగా అభివృద్ధి సాధించిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వారి పాలన భ్రష్టు పట్టిపోతున్నాయని, శాంతి భద్రతలు క్షీణించాయని ఇక్కడ వైసీపీ, అక్కడ బిఆర్ఎస్ పార్టీలు వాదిస్తున్నాయి.
Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?
రైతులకు మద్దతుగా అంటూ డిసెంబర్‌లో ఇక్కడ వైసీపీ హడావుడి చేస్తే, ఇటీవల బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చేసింది.
ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్ కోసం వైసీపీ పోరాటం మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించగానే, అక్కడ బిఆర్ఎస్ పార్టీ కూడా ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్ పోరాటానికి సిద్దమైపోయింది.
ఈవిదంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తున్న ఈ రెండు పార్టీల పొలిటికల్ క్యాలండర్ కార్యక్రమాలన్నీ ఒకేవిదంగా ఉండటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నా ఇవన్నీ వాటి మద్య ఉన్న అవినాభావ సంబందాన్ని తెలియజేస్తున్నాయి.