చంద్రబాబు అవినీతిపరుడని బ్రాండింగ్‌కు వైసీపి కుట్ర?

Chandrababu Naidu YS Jaganటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవలసి వస్తే ఐ‌టి రంగం, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి గురించి తప్పక చెప్పుకోవలసి ఉంటుంది. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడని, అందుకే ఆయనను గద్దె దించేందుకు కేసీఆర్‌ కూడా ఓ చెయ్యి వేశారని అందరికీ తెలుసు.

ADVERTISEMENT

ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే తెలంగాణకు పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు క్యూ కడుతున్నాయి. అందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఆరాచక పరిస్థితులు కూడా కారణమని అందరికీ తెలుసు.

ఈ నేపధ్యంలో ఏపీ ప్రజలు వైసీపి పాలన రుచి కూడా చూశారు కనుక మళ్ళీ టిడిపివైపు మొగ్గు చూపే అవకాశం ఉందని, కనుక ‘చంద్రబాబు నాయుడు కూడా’ అవినీతిపరుడని ముద్ర వేయగలిగితేనే ఎన్నికలలో దెబ్బతీయగలమని వైసీపి అధినేత జగన్‌ కొత్త ఆలోచన చేస్తున్నట్లున్నారు.

అందుకే జైల్లో వేసేశారు. చంద్రబాబు నాయుడుకి అటు కేంద్రం, ఇటు న్యాయస్థానాలలో కూడా ఉపశమనం లభించకుండా చక్రం తిప్పుతూ, జైల్లో ఉంచగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారు కనుకనే కోర్టులు బెయిల్ మంజూరు చేయడం లేదని, జ్యూడిషియల్ రిమాండ్‌ పొడిగిస్తున్నాయంటూ వైసీపి ప్రచారం చేస్తుండటం కూడా ఈ కుట్రలో భాగంగానే చూడవచ్చు.

వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి తాజా ట్వీట్ చూస్తే ఈ విషయం మరింత బాగా అర్దమవుతుంది. “ప్రజాధనం లూటీ చేసినందుకు జైలుపాలైన చంద్రబాబు గారి కోసం ఆయన పార్టీ చేస్తున్న దీక్షలు, అహంకారపూరిత వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారు. 21 ఏళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ ప్రజా పోరాటాలను గాలికొదిలేసి జైలుపాలైన ఒక్కడిని బయటకు తెచ్చేందుకు నానాయాగీ చేస్తోంది. ఆ వ్యక్తే మీకు ముఖ్యమైనప్పుడు ప్రజలు ఓట్లెందుకు వేయాలి?” అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

అయితే చంద్రబాబు నాయుడుని జైల్లో వేసినందుకు ప్రజలలో సానుభూతి ఏర్పడిందని, టిడిపి కూడా దీనిని తమకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు చేస్తోందని, దాని ప్రయత్నాలు ఫలించి ప్రజల సానుభూతి ఓట్ల రూపంలోకి మారితే టిడిపి లబ్ధి పొందుతుందని వైసీపి అధినేత జగన్‌ బాగానే గుర్తించిన్నట్లున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నా ఆయనను విడిచిపెట్టడం లేదు.

ఎన్నికలలోగా చంద్రబాబు నాయుడు అవినీతిపరుడని బ్రాడింగ్ చేసి ప్రజలను నమ్మించగలిగితే అప్పుడు మరోదారి లేక సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచిపెడుతున్న వైసీపికే ఓట్లు వేస్తారని జగన్‌ భావిస్తుండవచ్చు. అయితే ఇటువంటి కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గ్రహించలేరనుకోవడమే అవివేకమే కదా?

ADVERTISEMENT
Latest Stories