ఈవీఎం లు వద్దు, బ్యాలెట్లు రద్దు..ఓన్లీ ఏకగ్రీవలెనా.?

Pulivendula zptc elections

పరామర్శ యాత్రలు, ఓదార్పు పర్యటనలు అంటూ వైసీపీ చేస్తున్న ఐప్యాక్ రాజకీయాలకు ప్రస్తుతానికి వైసీపీ ప్యాకప్ చెప్పినట్టు తెలుస్తుంది. వైస్ కుటుంబానికి కంచుకోట, వైస్ జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో వైసీపీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.

తన చిరకాల ప్రత్యర్థి బీటెక్ రవి సతీమణి లతా రెడ్డి చేతిలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో పులివెందుల వైసీపీ క్యాడర్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులలో నిశ్శబ్దం అలుముకుంది.

ADVERTISEMENT

నాటి నుంచి నేటి వరకు వైస్ జగన్ కానీ ఆ పార్టీ ముఖ్య నాయకులు కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చింది లేదు, వైసీపీ బలోపేతం కోసం చేసింది లేదు. నాటి కుప్పం ఓటమికి నేడు పులివెందుల విజయం టీడీపీ కి రిటర్న్ గిఫ్ట్ గా వస్తే నాటి వైసీపీ అధికార గర్వానికి నేటి పులివెందుల ఓటమి అవమానం వైసీపీ కి రిటర్న్ గిఫ్ట్ అయ్యింది.

జగన్ నాలుగు పర్యటనలతో వైసీపీ చేసిన బలప్రదర్శన తో క్యాడర్ రప్ప రప్ప నరుకుతాం అనే వరకు వెళ్ళింది. తీరా అసలు విషయానికి వస్తే పులివెందులలోని వైసీపీ ని అక్కడి ప్రజలు రప్ప రప్పలాడించారు. దీనితో పులివెందుల ఓటమి వైసీపీ నోరునొక్కేసిందా అన్నటుగా ఎక్కడి నాయకులు అక్కడే గప్ చుప్ సాంబార్ బడ్ అన్నట్టుగా గమ్మునుండి పోయారు.

మొన్నటి దాకా సార్వత్రిక ఎన్నికల ఓటమికి ఈవీఎం లను బూచీలుగా చూపించి పెట్రేగిపోయిన వైసీపీ, బ్యాలట్ ఓటింగ్ కావాలంటూ పట్టుబట్టింది. తీరా బ్యాలట్ ఓటింగ్ కూడా వైసీపీ ని కాపాడలేకపోయే సరికి రిగ్గింగ్ అంటూ ఎన్నికల ఫలితాల పై చేతులెత్తేసింది.

ఈవీఎం ల ఓటింగ్ వైసీపీ కి ప్రతిపక్ష హోదా కూడా దూరం చేస్తే, బ్యాలట్ ఓటింగ్ ఏకంగా వైసీపీ డిపాజిట్లను గల్లంతు చేసాయి. దీనితో మరి ఈ సారి వైసీపీ ఏ తరహా ఓటింగ్ కోసం పట్టుబడుతుందో.? పోరాటం చేస్తుందో చూడాలి.

లేకుంటే తనకలవాటైన బెదిరింపు ఏకగ్రీవాలు జరగాల్సిందే, దానికి రాజ్యాంగ సవరణ చెయ్యాల్సిందే అంటూ “ఈవీఎం లు వద్దు, బ్యాలెట్లు రద్దు..ఓన్లీ ఏకగ్రీవాలే” అనే కొత్త నినాదంతో జగన్ తన ఓటమి 2.0 ప్రచారంతో ముందుకొస్తారేమో..!

ADVERTISEMENT
Latest Stories